Share News

మార్కెట్‌కు అనుగుణంగా బేళ్లను తీసుకురావాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:19 AM

పొగాకు నాణ్యత దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు ఈడీ విశ్వశ్రీ సూచించా రు. మార్కెట్‌లో ఏరకం బేళ్లకు డిమాండ్‌ ఉం దో పరిశీలించి అందుకు అనుగుణంగా వేలాని కి తీసుకురావాలని కోరారు.

మార్కెట్‌కు అనుగుణంగా బేళ్లను తీసుకురావాలి

బోర్డు ఈడీ విశ్వశ్రీ

కొండపి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : పొగాకు నాణ్యత దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు ఈడీ విశ్వశ్రీ సూచించా రు. మార్కెట్‌లో ఏరకం బేళ్లకు డిమాండ్‌ ఉం దో పరిశీలించి అందుకు అనుగుణంగా వేలాని కి తీసుకురావాలని కోరారు. మంగళవారం ఆ మె కొండపి వేలం కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం రైతుల తో సమావేశమై పలు సూచనలు చేశారు. పొ గాకు మండెల్లో దెబ్బతినకుండా మేలైన యా జమాన్య పద్ధతులను పాటించాలన్నారు. నోబి డ్స్‌ లేకుండా బేళ్లను కొనుగోలు చేయాలని కం పెనీల ప్రతినిధులకు సూచించారు. కార్యక్ర మంలో పొగాకు బోర్డు వైస్‌చైర్మన్‌ బొడ్డపాటి బ్రహ్మయ్య, బోర్డు ఇన్‌చార్జి సెక్రటరీ ఎం.లక్ష్మ ణరావు, వేలం నిర్వహణాధికారి జి. సునీల్‌కు మార్‌ పాల్గొన్నారు. అంతకుముందు టంగు టూరులో వేలాన్ని ఈడీ పరిశీలించారు. కా ర్యక్రమంలో అక్కడి సూపరింటెండెంట్‌ శ్రీనివా సరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:19 AM