Share News

అస్తవ్యస్తంగా మంచినీటి సరఫరా

ABN , Publish Date - Apr 08 , 2025 | 10:57 PM

దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎంతో కాలంగా ఫిల్టర్‌బెడ్లు మరమ్మతులకు నోచుకోలే దు. గ్రామీణ ప్రాంతాలకు రావాటర్‌ విడుదల చేస్తు న్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లు కాలం చెల్లిపోవటంతో సామర్థ్యం కోల్పోయి తరచూ పగిలిపోతున్నాయి. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు కూలేదశకు చేరాయి. దీంతో మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కల్గుతుంది.

అస్తవ్యస్తంగా మంచినీటి సరఫరా
దొనకొండ: కొచ్చెర్లకోటలో ట్యాంకర్‌ను చుట్టుముట్టి నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు

పనిచేయని ఫిల్టర్‌బెడ్లు

కాలంచెల్లిన పైపులైన్లు

తరచూ మరమ్మతులు

పలుగ్రామాలకు

సక్రమంగా అందని మంచినీరు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

దర్శి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎంతో కాలంగా ఫిల్టర్‌బెడ్లు మరమ్మతులకు నోచుకోలే దు. గ్రామీణ ప్రాంతాలకు రావాటర్‌ విడుదల చేస్తు న్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లు కాలం చెల్లిపోవటంతో సామర్థ్యం కోల్పోయి తరచూ పగిలిపోతున్నాయి. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు కూలేదశకు చేరాయి. దీంతో మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కల్గుతుంది.

దర్శి ఎన్‌ఏపీ మంచినీటి పథకం ద్వారా 120 గ్రా మాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అతిపెద్ద ప్రాజెక్టు అభివృద్ధి గురించి గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో అధ్వానంగా మారిం ది. ఫిల్టర్‌బెడ్లు ఎంతోకాలంగా మరమ్మతులు చేయక ఇసుక మట్టిగా మారిపోయింది. నిధు లు లేక ఫిల్టర్‌బెడ్లు అలాగే ఉం చారు. వేసవి ప్రారంభమైనందు న అధికారులు అప్రమత్తం కాక పోతే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉంది. దర్శి ప్రాంతంలో కోర్లమడుగు, కృష్ణాపురం, త్రిపుర సుందరీ పురం, సామంతపూడి, నిమ్మారెడ్డిపాలెం తదితర గ్రామాలకు సక్రమంగా మంచినీరు అందటం లేదు. ఆప్రాంతంలో పాత పైపులైన్లు దెబ్బతినటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొత్త పైపులై ను నిర్మాణం చేస్తున్నారు. ఎన్‌ఏపీ చెరువులో నిండు గా నీరు కనిపిస్తున్నప్పటికీ గత 40ఏళ్లుగా పూడిక తీయకపోవటంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. శి వారు గ్రామాలకు నీరు చేరటం లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత పథకం అభివృద్ధికి జిల్లా అధి కారులు రెండుసార్లు పరిశీలించారు. వీలైనంత త్వరలో ఫిల్టర్‌బెడ్లు మర మ్మతులకు, పైపులైన్ల పునర్నిర్మాణా నికి నిధులు విడుదల చేసి తాగునీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవా లని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

దొనకొండలో నీటి సమస్య తీవ్రం

దొనకొండ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మండలంలో తాగునీటి సమస్య తీవ్ర మైంది. గ్రామాలకు సాగర్‌ జలాలు సరఫరా చేసే చందవరం-1 స్టోరేజీ నిర్మాణం చేపట్టి దాదాపు 40 ఏళ్లు గడుస్తుండటంతో పైప్‌ లైన్‌ తరచూ పగలటం, లీకే జీలు అవుతున్నాయి. దీంతో సక్రమంగా నీరు సరఫరా కా వడంలేదు. మండలంలోని కొ చ్చెర్లకోట, కట్టకిందపల్లి, పు ల్లాయిపల్లి, సిద్దాయిపాలెం, బసిరెడ్డిపల్లి, నారపురెడ్డిపల్లి, అనంతవరం, రాగమక్క పల్లి, ఇండ్లచెరువు, రుద్రస ముద్రం, సంగాపురం తదితర గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ట్యాంక ర్లు ఏర్పాటు చేయటంతో ప్రజలు ట్యాంకర్‌ నీటిని పట్టుకొని మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

పొట్లపాడు మంచినీటి పథకం నిర్వీర్యం

కురిచేడు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని పొట్లపాడు గ్రామంలో రూ.12 కోట్లతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ఇంజనీరింగ్‌ లోపంతో ప్రారంభా నికి నోచుకోకుండానే పనిచేయడంలేదు. 24 గ్రామాల కు రక్షిత నీరు అందించడానికి నిర్మించిన పథకం ఆదిలోనే ఆగిపోయింది. ఈపథకానికి 3 కి.మీ దూరం లోని సాగర్‌ కాలువ నుంచి నీటిని పంపింగ్‌ చేసేందు కు ఏర్పాటుచేసిన మోటార్లు సామర్థ్యం చాలక నీటిని అంత దూరం అందించలేకపోయాయి. రైల్వే లైన్‌ డ బ్లింగ్‌ చేయడంతో పాటు ఆండర్‌పాస్‌ ఏర్పాటుచేస్తుం డగా పైప్‌ లైన్‌ పగలడంతో పూర్తిగా పథకం మూలన పడింది. మండలంలో పెద్దవరం, దేకనకొండ, పడమ రగంగవరం, గంగదొనకొండ, పొట్లపాడు గ్రామాలకు నేటికి రక్షిత నీరు అందడం లేదు. గతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలినా వారికి డబ్బులు సకాంలో ఇవ్వక పోవడంతో ట్యాంకర్ల యజమానులు నీరు తోలడానికి ముందుకు రావడం లేదు. దీంతో గ్రామాలలో దాహం కేకలు వినపడుతున్నాయి.

వారం రోజులుగా సరఫరా కాని ఎన్‌ఏపీ నీరు

ముండ్లమూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మండలం లోని పలు గ్రామాలకు ఎన్‌ఏపీ ద్వారా వారానికి ఒక రోజే నీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి పూర్తిగా రాకముం దే గ్రామాల్లో తాగునీటి కష్టాలు తప్పటంలేదు. సమ్మ ర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ అడుగంటిపోవడంతో సక్రమంగా నీటిని సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు తెలుపుతున్నారు. మండలంలోని నాయుడుపాలెం, త మ్మలూరు, పసుపుగల్లు, ఉమామహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, భీమవరం, వేముల, రమణారెడ్డిపాలెం, సుంకరవారిపాలెం, నూజెండ్లపల్లి, శంకరాపురం, పోల వరం గ్రామాలకు ఎన్‌ఏపీ నీరు నిలిచిపోయింది. అనే క గ్రామాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రమైంది.

Updated Date - Apr 08 , 2025 | 10:57 PM