ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:54 AM
డివిజన్లలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, వాటి పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ పనిచేసి, పార్టీకి పేరు తీసుకురావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గుంటూరు రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో 10,13,16,18 డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రజలు వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో అనేక ఇబ్బందులుపడ్డారని తెలిపారు.

ఒంగోలు, కార్పొరేషన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : డివిజన్లలో ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, వాటి పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ పనిచేసి, పార్టీకి పేరు తీసుకురావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గుంటూరు రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో 10,13,16,18 డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రజలు వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో అనేక ఇబ్బందులుపడ్డారని తెలిపారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో, డివిజన్‌లో కార్యకర్తలు, నాయకులు చేసిన కృషి వలన నేడు గెలుపు సాధించి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గతంకంటే రెట్టింపుగా పనిచేసి, ప్రజల సమస్యలు పరిష్కార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వేసవి అయినందున డివిజన్లలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఏదైనా సమస్యలు ఉన్నపుడు క్లస్టర్‌ఇన్‌చార్జులతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సమావేశంలో క్లస్టర్ ఇన్‌చార్జులు షేక్ కపిల్ బాషా, బండారు మదన్, ఆయా డివిజన్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.