Share News

రఘునందనుడికి గజ వాహన సేవ

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:55 AM

ప్రసిద్ధిగాంచిన చదలవాడ శ్రీరఘునాయకస్వామి వారి 240వ వార్షిక కల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా సాగుతున్నాయి.

రఘునందనుడికి గజ వాహన సేవ

నాగులుప్పలపాడు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధిగాంచిన చదలవాడ శ్రీరఘునాయకస్వామి వారి 240వ వార్షిక కల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా సాగుతున్నాయి. ఆలయ ఈవో అనిల్‌ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం స్వామి వార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అ నంతరం సూర్యచంద్ర ప్రభోత్సవం నిర్వహించారు. రాత్రికి స్వామివారిని విశేషా లంకరణలో గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. మద్దిరాలపాడు గ్రా మానికి చెందిన పెనుబోతు రంగారావు, మల్లిఖార్జునరావు, భానుప్రసాద్‌, ప్రసా ద్‌బాబు, నిర్మల్‌కుమార్‌, శంకరరావు, శ్రీనివాసరావు, శ్రీధర్‌బాబు, నాగేశ్వరరావు, వాసుబాబు, హైమావతి ఉభయదాతలుగా వ్యవహరించారు. గవండ్లపాలెం జా లయ్యమాస్టార్‌ బృందం కోలాట ప్రదర్శన, వెలిగండ్ల ముక్కు వెంకటరెడ్డి మాస్టార్‌ బృందం బృందావన కులుకు చెక్కభజన, నెల్లూరు వేంకటేశ్వర నాట్యమండలిచే సత్యహరిచ్చంద్ర నాటకం ప్రదర్శించారు. ఆలయ కమిటీ ఆధ్వ ర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. కాగా సోమవారం శ్రీరఘు నాయక స్వామి వార్ల కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 01:55 AM