Share News

హత్య చేసి నేలబావిలో పడేశారు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:50 PM

వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని పథకం ప్రకారం భర్తను భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్య చేసి నేలబావిలో మృతదేహాన్ని పడేశారు. ఒంగోలు నగరం నుంచి దశరాజుపల్లి వెళ్లే రోడ్డులో అప్పాయికుంట సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.

హత్య చేసి నేలబావిలో పడేశారు
మృతదేహం పడేసిన బావి వద్ద పరిశీలిస్తున్న పోలీసులు(ఇన్‌సెట్లో)అర్జున్‌రెడ్డి(ఫైల్‌)

అర్జున్‌ రెడ్డి మృతదేహాన్ని గుర్తించిన బంధువులు

వివాహేతర సంబంధమే హత్యకు కారణం!

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని పథకం ప్రకారం భర్తను భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్య చేసి నేలబావిలో మృతదేహాన్ని పడేశారు. ఒంగోలు నగరం నుంచి దశరాజుపల్లి వెళ్లే రోడ్డులో అప్పాయికుంట సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఒంగోలురూరల్‌ మండలం పాతపాడుకు చెందిన మూరబోయిన అర్జున్‌రెడ్డి(55)ను హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం నిందితుడు రమే్‌షరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బావిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మృతదేహం అర్జున్‌రెడ్డిదిగా మృతుడి కుమార్తెలు, కుమారుడు గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పథకం ప్రకారమే హత్య...

పాతపాడుకు చెందిన కావూరి రమే్‌షరెడ్డి, అర్జునరెడ్డి భార్య మధ్య 20 ఏళ్లగా వివాహేతర సంబంధం ఉంది. ఐదునెలల నుంచి అర్జున్‌రెడ్డిని అడ్డుతొలగించుకోవాలని వారిద్దరూ పథకం రూపొందించారు. గత నెల 19న పాతపాడు నుంచి అర్జున్‌ రెడ్డి ఆటోలో ఒంగోలు బయలుదేరాడు. ఆయన వెనకనే రమే్‌షరెడ్డి మోటార్‌ సైకిల్‌పై వచ్చాడు. కరవది వరకు వచ్చిన తరువాత ఆటో ఆపి అర్జున్‌రెడ్డిని మోటర్‌ సైకిల్‌ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఒంగోలు నగరంలో కొత్తపట్నం బస్టాండ్‌ వద్దకు వచ్చి అక్కడ మద్యం కొనుగోలు చేశారు. అక్కడ నుంచి అప్పాయికుంటకు వెళ్లే దా రిలో వాలీబాల్‌ కోర్టు సమీపంలో ముళ్లపొదల్లోకి వెళ్లారు. అర్జున్‌ రెడ్డితో మద్యం తాగించిన రమే్‌షరెడ్డి తనతో తెచ్చిన పురుగుల మం దును చెవులో పోశాడు. అపస్మారక స్థితికి వెళ్లిన అర్జున్‌రెడ్డి కణత మీద బండరాయితో మోదాడు. అతను మృతి చెందాడని నిర్ధారించుకున్నాక.. అప్పటికే పాతపాడు నుంచి ఒంగోలు వచ్చిన అర్జున్‌ రెడ్డి భార్యకు ఈ విషయం చెప్పడంతో ఆమె కూడా అక్కడకొచ్చింది. వారిద్దరూ కలిసి మృతదేహాన్ని నేలబావిలో పడవేసినట్లు రమే్‌షరెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.


నిందితులను అదుపులోకి తీసుకున్నాం

ఒంగోలు తాలుకా సీఐ అజయ్‌ కుమార్‌

గత నెల 29న అర్జున్‌ రెడ్డి సోదరుడు వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసుగా నమోదు చేశామని తెలిపారు. అర్జున్‌ రెడ్డి కనిపించిన రోజు నుంచి గ్రామంలో రమేష్‌ రెడ్డి, సుశీల కనిపించచడం లేదన్నారు. దీంతో విచారణ ప్రారంభించి ఇరువురిని గురువారం అదుపులోకి తీసుకున్న తరువాత హత్య బయట పడిందని చెప్పారు. 2012లో కూడా రమే్‌షరెడ్డి భార్యను హత్య చేసిన కేసు తాలూకా పోలీసు స్టేషన్‌లో అతనిపై నమోదై ఉందన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:50 PM