Share News

ఓటర్‌ ఎన్‌రోల్‌మెంట్‌పై అభ్యంతరాలు తెలపండి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:05 PM

ఓటు కార్టు నవీకరణ (ఎన్‌రోల్‌మెంట్‌)లో అభ్యంతరాలు ఉంటే వెంటనే పరిష్కారం పొందాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కా ర్యాలయంలో అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులతో, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. నూతన, తొలగింపులు, మార్పులు, చేర్పులపై సుదీర్ఘంగా చర్చించారు.

ఓటర్‌ ఎన్‌రోల్‌మెంట్‌పై అభ్యంతరాలు తెలపండి
మాట్లాడుతున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, పక్కన తహసీల్దార్‌ గోపీకృష్ణ

ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

చీరాల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : ఓటు కార్టు నవీకరణ (ఎన్‌రోల్‌మెంట్‌)లో అభ్యంతరాలు ఉంటే వెంటనే పరిష్కారం పొందాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కా ర్యాలయంలో అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులతో, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. నూతన, తొలగింపులు, మార్పులు, చేర్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ని యోజకవర్గ పరిధిలోని 218 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి ఇప్పటి వరకు వ చ్చిన సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌వోలతో మాట్లాడుతూ వచ్చిన అర్జీ ల్లో సమస్యలు ఉంటే నేరుగా అధికారి దృ ష్టికి తెచ్చి, సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గోపీకృష్ణ, మునిసిపల్‌ డీఈ రఘురామ్‌, ఎలక్షన్‌ డీటీ సుశీల పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:05 PM