Share News

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:07 AM

పట్టణంలోని విత్తన దుకాణాలను గుంటూరు వ్యవసాయ కమీషనరేట్‌ అధికారి కె భాస్కర్‌ శుక్రవారం తనిఖీ చేశారు.

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

పొదిలి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని విత్తన దుకాణాలను గుంటూరు వ్యవసాయ కమీషనరేట్‌ అధికారి కె భాస్కర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. దర్శి ఏడీఏ బా లాజీనాయక్‌ అధ్వర్యంలో విత్తన దుకాణా లను పరిశీలించారు. భవానీ ఫర్టీలైజర్స్‌, వీరాంజనేయ ఫర్టీలైజర్స్‌ దుకాణాల్లో పత్తి విత్తనాలు 11 శాంపిల్స్‌ను తీసి పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరు చట్టానికిలోబడి వ్యాపారం చేయాలన్నారు. కాదని నకిలీ విత్తనాలు అమ్మినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ న్నారు. రైతు విత్త నాలు, మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పకుండా బిల్లు ఇవ్వాల న్నారు. నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని చెప్పారు. గత ఏడాది అమ్మకాల రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు స్టాకు రిజిస్టర్‌లో స్టాకును సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం ట్రాన్స్‌పోర్ట్‌ల్లో నకిలీ విత్తనాలు వస్తున్నాయని విజయజానకి ట్రాన్స్‌ ఫోర్ట్‌ను తనిఖీ చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌లో ఏమైనా విత్తనాలు వస్తే వెంటనే సంబంధిత వ్యవ సాయాధికారికి సమాచారం ఇవ్వాలని ట్రాన్స్‌పోర్ట్‌ యజ మానికి సూచించారు. ఈ తనిఖీల్లో గుంటూరు ఏడీఏ మోహన్‌రావ్‌, జిల్లా వ్యవసాయ కార్యాలయం నుండి వీవీ రమేష్‌, మండల వ్యవసాయా ధికారి షేక్‌ జైన్‌లాబ్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:07 AM