ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:02 PM
ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మంగళవారం దొనకొండలోని సచివాలయం-1 కార్యాల య ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆమె మాట్లాడా రు. దర్శి నియోజకవర్గంలో ఏఒక్కరూ సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈకార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు చెప్పారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రజదర్బార్‌లో వెలువెత్తిన అర్జీలు
దొనకొండ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మంగళవారం దొనకొండలోని సచివాలయం-1 కార్యాల య ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆమె మాట్లాడా రు. దర్శి నియోజకవర్గంలో ఏఒక్కరూ సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈకార్యక్రమాలు నిర్వహి స్తున్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. దొనకొండలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి రవికుమార్ ఇప్పటికే ప్రకటించారన్నారు. పరిశ్ర మల ఏర్పాటుతో దొనకొండ అభివృద్ధి చెందుతుం దన్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీలను సాధ్యమైన వి తక్షణమే పరిష్కరిస్తామన్నారు. మిగిలినవి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామన్నారు. మండలంలోని ప లు గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై 197 అర్జీలు అందజేశారు. వాటిలో పింఛన్ల కోసం 50, రెవెన్యూ సమస్యలపై 110, హౌసింగ్ 3, నీటి సమస్యపై 18, విద్యుత్ సమస్యలపై 16 అర్జీలు అందినట్లు సమా చారం.
కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లలిత్‌సాగర్, తహసీల్దార్ బి.రమాదేవి, ఎంపీడీ వో శ్రీదేవి, విద్యుత్ ఈఈ పి.శ్రీనివాసరావు, ఏడీఈ హరిబాబు, ఎంఈవో సాంబశివరావు, టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, జడ్పీటీసీ సు ధాకర్, ఎస్‌ఐ త్యాగరాజు, వివిధశాఖలకు చెందిన అధి కారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
దొనకొండ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షే మమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆపార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మంగళ వారం జరిగిన టీడీపీ మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. మండలం లో సిమెంట్ రోడ్ల ఏర్పాటు, రీసర్వేలో జరిగిన తప్పులను సవరించుకునేందుకు తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిర గలేకపోతున్నామని పలువురు టీడీపీ కార్యకర్తలు సమావేశం లో ప్రస్తావించారు. ఈసంద ర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కార్యకర్తల కు టుంబాలకు టీడీపీ అండగా ఉంటుందనేందుకు మం డలంలోని కలివెలపల్లి గ్రామా నికి చెందిన కార్యకర్త శ్రీరాం వెంకటయ్య మృతిచెం దటంతో అతని భార్యకు రూ.5 లక్షలు అందించటమే అందుకు నిదర్శనమన్నారు. కార్యకర్తలకు అండగా ఉం టామన్నారు. కార్యకర్తల జోలికి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకునేందుకు విభేదాలు వీడి ప్రతిఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నియోజక వర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, జ డ్పీటీసీ మాజీ సభ్యుడు పులిమి రమణాయాదవ్, నాయకులు మోడి వెంక టేశ్వర్లు, కామేపల్లి చెంచయ్య, మోడి ఆంజనేయులు, శృంగారపు నాగసుబ్బారెడ్డి, సింగమనేని హనుమంతు, వడ్లమూడి వెంకటాద్రి, వల్లపునేని వెంకటస్వామి, దుగ్గెంపూడి చెంచయ్య, విప్ప ర్ల లక్ష్మీరావు, వైకే చౌదరి, మన్నెం గాలయ్య, కుందుర్తి లక్ష్మణ్, తదితరులు పా ల్గొన్నారు.
ఆంజనేయస్వామి ఆశీస్సులతో అభివృద్ధి చేస్తాం
దర్శి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): శ్రీ ప్రసన్నాంజ నేయస్వామి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్నీ రంగా ల్లో అభివృద్ది చేస్తానని టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండలంలోని రాజంపల్లి సమీపాన ముసీనది తీరాన సోమవారం రాత్రి జరిగిన శ్రీప్రస న్నాంజనేయస్వామి తిరునాళ్ల ఉత్సవాల్లో డాక్టర్ గొట్టిపా టి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు పాల్గొని స్వా మివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజం పల్లి, కుంచేపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ప్రభల వద్ద ప్రజలనుద్దేశించి మట్లాడా రు. దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు పునఃప్రారంభానికి నిధులు విడుదల అవుతున్నాయ న్నారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారిని ఘనంగా సన్మానించారు.
మహిళల స్వయం ఉపాధికి ప్రాధాన్యం
దొనకొండ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాం తాల్లోని మహిళలు స్వశక్తిపై నిలచి, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దొనకొండలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బీసీ ఫైౖనాన్స్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో శ్రీదేవి, తది తరులు పాల్గొన్నారు.