రోడ్డు నిర్మాణం చేపడతాం!
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:19 AM
రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ఇ బ్బందులను తీరుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి హామీ ఇచ్చా రు. గురువారం కనిగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కంభాలదిన్నె పంచాయతీ ప్రజలు కలిశారు. మండలంలోని కంభాలదిన్నె, రేణిమడుగు, అక్కంపేట, ఆర్‌ఎస్‌పేట గ్రామస్థులు సరైన రోడ్డులేక తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.

పామూరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ఇ బ్బందులను తీరుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి హామీ ఇచ్చా రు. గురువారం కనిగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కంభాలదిన్నె పంచాయతీ ప్రజలు కలిశారు. మండలంలోని కంభాలదిన్నె, రేణిమడుగు, అక్కంపేట, ఆర్‌ఎస్‌పేట గ్రామస్థులు సరైన రోడ్డులేక తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ప్రధానంగా రేణిమడుగు-రాజసాహేబ్‌పేట రోడ్డు దారుణంగా ఉంది. గుంతలమయమైన ఆ రోడ్డులో ప్రయాణిం చాలంటే నరకాన్ని చూ స్తున్నామని ఏకరువుపెట్టారు. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బం దులు తొలగిస్తామని డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. ఉగ్రను కలిసిన వారిలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు గద్దె గంగయ్యచౌదరి, తెలుగురైతు మండల అధ్యక్షుడు మన్నం రమణయ్య, గోళ్ల వీరబాబు, గద్దె మోహన్, కమ్మ బాల కృష్ణ, జి.వెంకటేశ్వర్లు, కమ్మ మాల్యాద్రి, కొండలరావు, మాదవ, నాని, మ హేష్, హజరత్, మాలకొండయ్య, ఉన్నారు.