President Draupadi Murmu : పోలవరం ప్రాజెక్టుకి 12 వేల కోట్లు
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:26 AM
పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వమే గాక.. కేంద్రంలోని మోదీ సర్కారు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం మరోసారి వెల్లడైంది.

రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేక ప్రస్తావన
న్యూఢిల్లీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వమే గాక.. కేంద్రంలోని మోదీ సర్కారు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం మరోసారి వెల్లడైంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 12వేల కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె ప్రత్యేకంగా పోలవరం గురించి ప్రస్తావించారు. అలాగే కాశీ-తెలుగు సంగమం, కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో కేంద్రం దేశ సమైక్యతను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.