ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

ABN, Publish Date - Jan 12 , 2025 | 03:47 AM

ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి.

Sankranti Cock Fights
  • కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

  • కోస్తా జిల్లాల్లో సంక్రాంతికి ఏర్పాట్లు పూర్తి

  • ఇతర రాష్ట్రాల నుంచీ వస్తున్న పందెంరాయుళ్లు

  • చిన్న పట్టణాల్లోనూ హోటల్‌ రూమ్‌లన్నీ ఫుల్‌

  • బరుల వద్ద విందు, వినోద కార్యక్రమాలు

  • ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు

  • కరపలో పందెం కొట్టినోళ్లకు థార్‌ జీప్‌

  • వందల కోట్లు చేతులు మారతాయని అంచనా

(భీమవరం, కాకినాడ, మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి)

ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి. మరో పక్క బరులు సిద్ధమవుతున్నాయి. పందెం కోళ్లు పోరాటానికి కాలు దువ్వుతున్నాయి. ఇంకోపక్క కోడి పందేలకు తోడు గుండాట, పేకాట టేబుళ్లు రెడీ అవుతున్నాయి. కోస్తా జిల్లాల్లో ఎటు చూసినా సంక్రాంతి సంబరాల జోష్‌ కనిపిస్తోంది. పలు ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు బరుల ప్రాంతాలకు చేరుకుంటున్నారు. హోటళ్లు అన్నీ కిటకిటలాడుతున్నాయి. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద బరుల వద్ద విందు, వినోద కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆఫర్లలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పశ్చిమంలో పెద్ద బరులు..

పందేలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన గోదావరి జిల్లాల్లో బరులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. పశ్చిమ గోదావరిలో భారీ బరులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి ఈసారి అధిక సంఖ్యలో పందెం రాయుళ్లు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈసారి ఐదు రోజుల వరకు జిల్లాలోని అన్ని హోటళ్లు భర్తీ అయిపోయాయి. భీమవరం రూరల్‌ మండలంలో ఎల్‌ఈడీ బల్బులతో, వినోద కార్యక్రమాలతో పెద్ద ఎత్తున బరి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. పెదఅమిరంలో ప్రారంభ పందాన్ని రూ.కోటితో నిర్వహిస్తారని చెబుతున్నారు.


కలగంపూడి కథే వేరు..

పాలకొల్లు నియోజకవర్గంలోని కలగంపూడిలో పెద్ద బరి వద్ద కుటుంబ సమేతంగా కోడి పందేలను వీక్షించడానికి గతంలోలాగే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమీపంలోని యలమంచిలిలో విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబాలతో సహా వచ్చే వారికి ఫొటో సెషన్‌ ఉంటుంది. పెద్దమొత్తంలో పందేలు కాసేవాళ్లు ఇదే బరికి వెళుతుంటారు.

పందేలకు ‘తూర్పు’ సై..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. కరపలో ఓ బరిలో మూడు రోజులకు కలిపి 63 జతల జోడు పందేలు నిర్వహించనున్నారు. ఇందులో అత్యధిక పందేలు గెలిచిన విజేతకు మహీంద్రా థార్‌ జీపు బహుమతిగా ఇవ్వనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, అనపర్తి, రాజమండ్రి రూరల్‌, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు.

పండగ జోష్‌కు కృష్ణా సిద్ధం..

ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండగకు కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. బరుల వద్ద పేకాట, గుండాట కేంద్రాలు ఏర్పాటుచేశారు. కోడి పందేలతోపాటు పేకాట రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు పెద్దఎత్తున సౌకర్యాలు సమకూర్చేపనిలో ఉన్నారు. బాపులపాడు మండలంలోని అంపాపురంలో హైటెక్‌ హంగులతో భారీ బరిని ఏర్పాటుచేశారు. కేసీనోని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడి పెద్దబరుల్లో ఒక్కో పందేనికి రూ.20 లక్షలుగా నిర్ణయించారు. కాగా, కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 08:44 AM