Share News

స్లాట్‌ బుకింగ్‌ సక్సెస్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:51 AM

ఇక రోజువారి రిజిస్ట్రేషన్లలో ముందస్తు స్లాట్‌ పద్ధతి శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తొలి స్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజి స్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ కార్యాలయాల్లో ఎవరైనా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే ముందస్తుగా నిర్దేశించిన వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవా లి.

స్లాట్‌ బుకింగ్‌ సక్సెస్‌
ఏలూరు రిజిస్ర్టార్‌ కార్యాలయంలో శుక్రవారం నూతన స్లాట్‌ బుకింగ్‌ ద్వారా తొలి రిజిస్ట్రేషన్‌ చేసిన ఏలూరుకు చెందిన కూరపాటి రాశికి పత్రాలు అందజేస్తున్న జిల్లా రిజిస్టార్‌ శ్రీనివాసరావు

సమయం కలిసొచ్చిందంటూ కక్షిదారుల ఆనందం

తొలిరోజు సాఫీగా15కు పైగా రిజిస్ట్రేషన్లు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఇక రోజువారి రిజిస్ట్రేషన్లలో ముందస్తు స్లాట్‌ పద్ధతి శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తొలి స్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజి స్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ కార్యాలయాల్లో ఎవరైనా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే ముందస్తుగా నిర్దేశించిన వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవా లి. దీని ప్రకారమే తేదీ, సమయం సంబంధీకులకు అందుతుంది. ఇంతకు ముందున్న పాత పద్ధతికి స్వస్తి చెప్పి స్లాట్‌ బుకింగ్‌ పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం తెరముందుకు తెచ్చింది. తొలి రోజైన శుక్రవారం ఏలూరు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 15 మందికి పైగా ఈ పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు దిగారు. తొలిగా ఏలూరుకు చెందిన కూరపాటి రాశి రిజిస్ట్రేషన్‌ చేయగా రిజిస్ట్రేషన్‌ పత్రాలను జిల్లా రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాసరావు అందించారు. ‘నిజం గా.. రిజిస్ట్రేషన్‌ శాఖలో వచ్చిన కొత్త పద్ధతి చాలా బాగుంది. ముందస్తు సమాచారాన్ని అందుకుని కార్యాలయానికి వచ్చాం. క్షణాల్లో పని పూర్తయ్యిం ది. సంతోషంగా ఉంది’ అని రాశి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా రిజిస్ట్రార్‌ సత్యనారాయణ సైతం ప్రజలు స్లాట్‌ బుకింగ్‌ పద్ధతిపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా రిజిస్ట్రేషన్లకు సులువు అవుతుందని పేర్కొన్నారు. తొలిరోజే 15కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.

Updated Date - Apr 05 , 2025 | 12:51 AM