ABN Andhra Jyothi: సౌత్‌మోపూరుకు రోడ్లొచ్చాయి

ABN, Publish Date - Apr 04 , 2025 | 05:13 AM

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సౌత్‌మోపూరు గ్రామ అభివృద్ధికి ప్రేరణ ఇచ్చింది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గ్రామానికి రూ.1.20 కోట్లు మంజూరు చేసి, రోడ్ల, ప్రహరీ గోడల నిర్మాణం ప్రారంభించారు

 ABN Andhra Jyothi: సౌత్‌మోపూరుకు రోడ్లొచ్చాయి
  • రూ.1.2 కోట్లతో అభివృద్ధి పనులు

  • రూ.94 లక్షలతో ఊరంతా సీసీరోడ్ల నిర్మాణం పూర్తి

  • రూ.26 లక్షలతో టెండర్ల దశలో ప్రహరీలు

నెల్లూరురూరల్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఒక గ్రామ అభివృద్ధికి అండగా నిలిచింది. నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరు గ్రామ ప్రజల ఇబ్బందులను జనవరి 27న వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గ్రామంలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నేతృత్వంలో 28న ప్రజాసదస్సు నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించిన ఆయన రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మేరకు ఫిబ్రవరి 6వ తేదీన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నేత గిరిధర్‌రెడ్డి సిమెంట్‌ రోడ్ల పనులు ప్రారంభించారు.


ప్రధాన రహదారితోపాటు హైస్కూల్‌ ప్రాంగణంలోనికి, ప్రభుత్వ కళాశాలకు, గమళ్లపాళెం, యాదవపాళెం, వడ్డిపాళెం, అరుంధతీపాళెంకు రూ.94 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో రూ.26 లక్షలతో వాణిశ్రీ జడ్పీ హైస్కూలుకు, గిరిజనపాళెం (కనుజులమిట్ట)లోని శ్మశానానికి ప్రహరీ గోడల నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఊహించని రీతిలో గ్రామంలో అభివృద్ధి పనులు చకచకా జరగడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:14 AM