Share News

వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:49 PM

కోటబొమ్మాళి స్టేట్‌ బ్యాంకు వెనుక, ప్రకాష్‌ నగర్‌ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

కోటబొమ్మాళి ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి స్టేట్‌ బ్యాంకు వెనుక, ప్రకాష్‌ నగర్‌ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన కోరాడ వాసుదేవరావు (58) ప్రకాష్‌ నగర్‌లో నివాసం ఉంటూ ఓ హోటల్‌లో వంట పనులు చేసు కుంటూ జీవనం సాగి స్తున్నాడు. వారం రోజులుగా హోటల్‌కు వెళ్లలేదని, ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నారో తెలియదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. మృతి విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సత్య నారాయణ సిబ్బందితో కలిసి ఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గాంధీనగర్‌లో మరో వ్యక్తి..
సోంపేట, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి):
స్థానిక గాంధీనగర్‌ వీధికి చెందిన గేదల ధర్మారావు(42) ఆదివారం రాత్రి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మారావు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతడికి భార్య మోహినితో పాటు ఇద్దరు పిల్లలున్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ధర్మారావు రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతికారు. సోమవారం ఉదయం గొల్లవాని చెరువు వెనుక జీడితోటలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మోహిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లవరాజు తెలిపారు. మృతదేహాన్ని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

ఫొటో: డైడ్‌

Updated Date - Apr 14 , 2025 | 11:49 PM