రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:56 PM
నిరుపేద కుటుంబాలకు ఆసరా గా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కు టుంబాలు సహాయం పొందుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.

అరసవల్లి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): నిరుపేద కుటుంబాలకు ఆసరా గా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కు టుంబాలు సహాయం పొందుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక విశాఖ-ఏ కాలనీలో గల తన కార్యాలయంలో ఆయన గార మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన గొలివి ప్రతాప్‌కు వైద్య ఖర్చుల కోసం రూ.10లక్షలు సీఎంఆర్‌ఎఫ్ మంజూరు పత్రాలను గురువారం అందజేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు.