KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:49 AM
KTR Vs CM Revanth: హెచ్‌సీయూ భూముల వ్యవహారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ స్కాం కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి అంటూ ఆరోపించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 11: కొద్ది రోజులుగా హెచ్‌సీయూ భూముల (HCU Lands) వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. హెచ్‌సీయూ భూములు పరిరక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగగా.. ఆ భూములు తమవే అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. హెచ్‌సీయూ భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. అలాగే ఈ భూములకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR)
మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
హెచ్‌సీయూ భూముల వెనుక 10 వేల కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందన్నారు. కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక బీజేపీ ఎంపీ సపోర్ట్‌తో రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూముల కుంభకోణానికి తెరతీశారని వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్ ఎడ్వజైర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసిందన్నారు. అందుకు గాను .. సదరు కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి పాలన అంటేనే.. మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడమనే త్రీడీ విధానంతో పేదల బతుకులను కాంగ్రెస్ నాశనం చేస్తోందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు.
Reduce Belly Fat: జపనీస్ సీక్రెట్.. ఈ వాటర్ తాగితే బాన పొట్ట పరార్..
అటవీ భూమిని అమ్మాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందన్నారు. నామమాత్రపు జీవోతో అమ్మకానికి పేపర్లు రాసిచ్చారన్నారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం ఆ భూమి విలువ రూ.5,239 కోట్లు అని చెప్పుకొచ్చారు. ఆ భూమి విలువ రూ.30 వేల కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని.. లేని భూమి ఉన్నట్లు చూపి లోన్ తీసుకోవాలని చూశారని వ్యాఖ్యలు చేశారు. భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. అతిపెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు చేశారు. తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెడ్తుంది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. స్కామ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. స్కామ్‌లో రేవంత్ రెడ్డికి సహకరిస్తుంది బీజేపీనే అని ఆరోపించారు. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటేనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే అంటూ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూ భూముల వెనుక క్విడ్ ప్రోకో ఉందన్నారు. సదరు బీజేపీకి రేవంత్ రెడ్డి కొన్ని లాభాలు చేయబోతున్నారన్నారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా.. 10వేల కోట్లు తెచ్చారన్నారు. లిటికేషన్ ల్యాండ్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
Police Case: గోరంట్లపై తాడేపల్లి పీఎస్‌లో కేసు
Read Latest Telangana News And Telugu News