విద్వేషాలు రెచ్చగొట్టేందుకే తప్పుడు వ్యాఖ్యలు: ఎమ్మెల్యే ఎంజీఆర్
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:24 AM
మత విద్వేషాలు రెచ్చగొట్టేం దుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

పాతపట్నం/ఎల్‌ఎన్‌పేట, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మత విద్వేషాలు రెచ్చగొట్టేం దుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా రని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం పాతపట్నంలో ఆయన విలేకరు లతో మాట్లాడుతూ.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో ఆవుల మృతిపై ఆయన చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, నాయకులు జి.అశోక్ పెద్దింటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం ఎల్ ఎన్‌పేట మండలం రావిచెంద్రి, పూశాం గ్రామాల్లో శుభకార్యాలకు హాజరై టీడీపీ నాయకులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం. మనోహర్ నాయుడు, కె.చిరంజీవి, ఎస్.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు తెలుసుకుంటూ..
మెళియాపుట్టి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుర్జని గ్రామంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుర్జిని గ్రామం నుంచి పెద్ద లక్ష్మీపురం గ్రామానికి రోడ్డు ఏరాపటు చేయాలని మాజీ సర్పంచ్ బుర్లె లలితకుమారి కోరారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరారు. కాలువలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడ తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సలాన మోహనరావు, తులసీవరప్రసాద్, బాస్కర్ గౌడో, దినకర్‌రావు, పైడిరాజ్, పరమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
‘భూమన’వి తప్పుడు ఆరోపణలు: ఎమ్మెల్యే శిరీష
పలాస, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై మాజీ చైర్మన్ భూమన కరుణా కర్‌రెడ్డివి తప్పుడు ఆరోపణలని చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తప్పుడు ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొ ట్టేలా ప్రయత్నం చేస్తు న్నారని విమర్శించారు. రోజు కో ఆరోపణలు చేస్తూ ఆలయ సంప్రదాయాలు, మర్యా దలకు భంగం కలిగిస్తున్నారన్నారు. గోవుల మరణాల ను రాజకీయం చేయడం తగదని, వంద ఆవులు మృతి చెందాయని ఆరో పించడంలో వాస్తవం లేదన్నారు. గోవులకు జియో ట్యాగింగ్ చేసి పర్యవేక్షిస్తారని, అటువంటి ధార్మిక సంస్థపై తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్న కరుణాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
టీటీడీ గోశాలపై విమర్శలు తగవు: ఎమ్మెల్యే బగ్గు
నరసన్నపేట, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): టీటీడీ గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు దుర్మార్గమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. వైసీపీ పాలనలో శ్రీవారి సంపద కొల్లగొట్టారని ఆరోపించారు. రోజూ వందలాది టికె ట్లను అమ్ముకుని దోచుకోవడంతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన భూమన కరుణకర్ రెడ్డి ఇప్పుడు సనాతన ధర్మంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో చేసిన అక్రమాలు, అరాచకాలు బయటకొస్తున్న తరుణంలో టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.