Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:20 AM

హిరమండలం ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ మానవతా దృక్పథం చాటుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
క్షతగాత్రులను తీసుకువెళుతున్న ఎస్‌ఐ ఎండీ యాసిన్‌

హిరమండలం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): హిరమండలం ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ మానవతా దృక్పథం చాటుకున్నారు. ఆదివారం రాత్రి కొండరాగోలు కాలనీ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తూరు మండలం ఇరపాడు గ్రామానికి చెందిన టేగ నారాయణరావు హిరమండలం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళుతూ కొండ రాగోలు కాలనీ సమీపంలో నడిచి వెళుతున్న అదే గ్రామానికి చెందిన గుజ్జు చిన్నారావును డీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. చిన్నారావుకు చెవుల నుంచి రక్తస్రావమై పరిస్థితి విషమంగా ఉండడంతో ఎస్‌ఐ యాసిన్‌ స్వయంగా పోలీస్‌ జీపులో ఎక్కించి హిరమండలం ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో 108వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. నారా యణరావుకు హిరమండలం ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఎస్‌ఐ స్పందించిన తీరును పలువురు ప్రశంసించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 14 , 2025 | 12:20 AM