TDP: అనంతా.. మభ్యపెట్టే మాటలు మానుకో...
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:55 PM
‘మీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ విషయాన్ని మరచి మరోసారి ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాల’ని వైసీపీ జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్(Venkatasivadu Yadav) హితవు పలికారు.

- జగన్‌రెడ్డికి భద్రత తగ్గించారనడం హాస్యాస్పదం
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్
అనంతపురం: ‘మీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ విషయాన్ని మరచి మరోసారి ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాల’ని వైసీపీ జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్(Venkatasivadu Yadav) హితవు పలికారు. జగన్‌రెడ్డికి భద్రత తగ్గించారని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Venkataramireddy: జగన్ ప్రజల్లో తిరగకూడదనే భద్రత కుదింపు..
ఈ మేరకు శుక్రవారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మిర్చి రైతులకు మద్దతు ధర లేదని గుంటూరు మిర్చి యార్డులో నిరసన చేయాలని జగన్‌రెడ్డి వెళ్లడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందన్న సంగతి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వెళ్లారే తప్ప... అక్కడ ఏం వెలగబెట్టారో చెప్పాలని నిలదీశారు.
అధికారంలో ఉన్నపుడు మిర్చి రైతులకు రూపాయి మేలు చేశారా అని ప్రశ్నించారు. దౌర్జన్యంగా మిర్చి యార్డులోకి వెళ్లి అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వైసీపీ అధినేత జగన్‌రెడ్డి(Jagan Reddy)కి సెక్యూరిటీ తీసేశామంటున్నారనీ, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తున్నామన్నారు.
అమ్మఒడి పథకం ఇవ్వకుండా చేశారని పేటీఎం బ్యాచ్‌లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివే పాపతో అబద్ధాలు చెప్పిస్తే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని ఆ పార్టీ నేతలను హెచ్చరించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, లీగల్ సెల్ రాష్ట్ర నేత గాజుల ఆదెన్న, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్‌మోద్దీన్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News