ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Membership Drive : కోటికి చేరువగా టీడీపీ సభ్యత్వం

ABN, Publish Date - Jan 01 , 2025 | 05:09 AM

తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఈసారి రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబరు 31నాటికి ఏకంగా 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.

  • రెండు నెలల్లో 94 లక్షలు నమోదు

  • సంక్రాంతి వరకూ గడువు పొడిగింపు

అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఈసారి రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబరు 31నాటికి ఏకంగా 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో సభ్యత్వం నమోదు కావడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సారి కోటి సభ్యత్వాలను నమోదు చేయాలన్న లక్ష్యంతో అక్టోబరు 26న పార్టీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి సరాసరి రోజుకు లక్షన్నర చొప్పున సభ్యత్వాలు నమోదవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. కోటి సభ్యత్వాల లక్ష్యాన్ని అందుకోవడానికి మరో 6 లక్షలు మాత్రమే కావాలి. దీంతో సభ్యత్వ నమోదు గడువును పొడిగించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కోరారు. వాస్తవానికి ఈ గడువు డిసెంబరు 31తో ముగిసింది. కానీ, పార్టీ నేతల వినతి మేరకు దీన్ని సంక్రాంతి వరకూ పొడిగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు లక్ష మార్కుని దాటేశాయి. ఇందులో మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నియోజకవర్గం నెల్లూరు 1.47 లక్షల సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలిచింది. మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పాలకొల్లు (1,44,992), మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరు (1,34,584) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజంపేట (1,29,783), కుప్పం (1,28,496), ఉండి (1,14,443), గురజాల (1,08,839), వినుకొండ (1,05,158), మంగళగిరి (1,04,122), కల్యాణదుర్గం (1,00,325) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Updated Date - Jan 01 , 2025 | 05:09 AM