ఆర్థికంగా ఎదిగినవారు పేదలకు చేయూతనివ్వాలి
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:50 AM
ఆర్థికంగా, సామాజికం గా ఎదిగిన వారు మరి కొంత మందికి చేయి అందించి అభివృద్ధికి సహకరించాలని అపుడే సమాజంలో పేదరికమనేది లేకుండా చేయగ లమని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

మొగల్రాజపురం, మార్చి 31 (ఆంఽధ్రజ్యోతి): ఆర్థికంగా, సామాజికం గా ఎదిగిన వారు మరి కొంత మందికి చేయి అందించి అభివృద్ధికి సహకరించాలని అపుడే సమాజంలో పేదరికమనేది లేకుండా చేయగ లమని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ (స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ) 8వ వార్షికోత్సవం సోమవారం మొగల్రాజపురం అమ్మ కల్యాణ మండపంలో జరిగింది. జ్యోతి వెలిగించిన ఉ మా మాట్లాడుతూ రాయల్ క్లబ్స్ సభ్యు లు ఏదైతే పేదలకు, తోటి సభ్యులకు చే స్తున్న సేవ అభినందనీయమన్నారు. సీ ఎం చంద్రబాబు సమాజంలో పేదరికం లేకుండాచేయాలనే సీ4 సర్వే చేపట్టారన్నారు. క్లబ్స్ అధ్యక్షుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహం, సేవ, సహకారం అనే మూడు నినాదాలతో ముందుకు వెళుతున్నామన్నారు. సభానంతరం బోండాడ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బోండాడ రా ఘవేంద్రరావుకు రాయల్ జీవిత సాఫ ల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అ ను గ్రూప్ ఆసుపత్రి చైర్మన్ గాజుల రమేష్, బార్ కౌన్సిల్ సభ్యుడు కలిగినీడి చిదంబరం, క్లబ్స్ కన్వీనర్ పేటేటి పుల్ల య్య, మిరియాల వెంకటేశ్వరరావు, రా మిశెట్టి కొండలరావు, యర్రంశెట్టి శివరామకృష్ణ, కార్యదర్శి రంగినీడి వెంకట సు బ్బారావు, కోశాధికారి నూతక్కి సత్యన్నారాయణ, రాయల్ క్లబ్స్ విజయవాడ, ఓ షో, చింతలపూడి, కైకలూరు, నరసాపు రం, ముత్యాలంపాడు, విజయవాడ మ హిళ, నరసాపురం మహిళా, అల్లవరం రాయల్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.