Bhumana: ఇది ముమ్మాటికి టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:13 PM
తొక్కిసలాట ఘటనకు టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) ఆరోపించారు.
- వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: తొక్కిసలాట ఘటనకు టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) ఆరోపించారు. గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాఉతూ నెలరోజులుగా వైకుంఠ ఏకాదశి పేరుతో సమీక్షలు నిర్వహించారే తప్పా ఆచరణలో తగిన ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. టీటీడీలో పనిచేసే వారు తక్కువయ్యారని పర్యవేక్షించేవారు ఎక్కువ అయ్యారని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: భూమనా.. శవ రాజకీయాలు మానుకో
దర్శనాలకు సంబంధించిన అంశం పూర్తిగా తిరుమల అడిషనల్ ఈవో వెంకన్నకు సంబంధించిందని ఆయనకు చంద్రబాబు(Chandrababu) సేవ తప్ప భక్తుల సేవ కనబడటంలేదని విమర్శించారు. ఈ ఘటనలో అడిషన్ ఈవో వెంకన్నచౌదరితో పాటు ఎస్పీ, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, ఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(CM Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan) పూర్తి బాధ్యత వహించాలన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన పవనానంద స్వామి దీనిపై మాట్లాడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ శిరీష, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మోహిత్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు
ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్
Read Latest Telangana News and National News