Gorantla Madhav: పోలీసుల నోటీసులు.. స్పందించిన గోరంట్ల మాధవ్
ABN , Publish Date - Feb 27 , 2025 | 07:49 PM
Gorantla Madhav: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నివాసానికి విజయవాడ పోలీసులు వెళ్లారు. ఆయనపై కేసు నమోదు అయిన నేపథ్యంలో నోటీసులు అందజేశారు. వచ్చే నెల మొదటి వారంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

అనంతపురం, ఫిబ్రవరి 27: హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ నివాసానికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు. ఆయనకు సెక్షన్ 35 బీఎన్ఎస్ఎస్ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. మార్చి 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని గోరంట్ల మాధవ్‌కు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
2024, నవంబర్ 2 తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.
స్పందించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
విజయవాడ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. అయినా నేరం చేసిన వారిని వదిలిపెట్టి.. ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చూడుతోందని ఆరోపించారు. అందుకు ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అతి త్వరలో మీ చేష్టలు, అక్రమ కేసులకు అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదన్నారు.
Also Read: గాంధీభవన్‌లో ఇకపై కనిపించని ఫ్లెక్సీలు, బ్యానర్లు
దీనిని కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైండ్‌లో పెట్టుకోవాలని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకున్నానన్నారు. మార్చి ఐదో తేదీన హాజరు కావాలని చెప్పారని.. న్యాయవాదుల సలహా తీసుకొని పోలీసుల విచారణకు వెళ్తాన్నారు. అయితే ప్రింట్ మీడియాలో సోషల్ మీడియలో వచ్చిన పేర్లను మాత్రమే తాను ప్రస్తావించాన్నారు. దీనిపై కేసు నమోదు చేసి అసలు ముద్దాయిలను వదిలిపట్టారని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.
గతేడాది నవంబర్‌లో..
గతేడాది నవంబర్‌లో అత్యచార బాధితుల పట్ల వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రేప్ బాధితుల వివరాలు.. గోరంట్ల మాధవ్ బహిర్గతం చేయడంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుకు ఆమె ఫిర్యాదు చేశారు. బాధితుల పట్ల దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ ఆమె విజయవాడ సీపీని కోరారు. గోరంట్లా మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఓ మీడియా చానెల్ పేరును సైతం ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ పోలీసులు ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లారు.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర దూషణలకు దిగిన పలువురు వైసీపీ నేతలు వరుసగా అరెస్టులు అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు ఈ దాడి కేసులో కీలక సాక్షిగా ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అలాగే పోసాని కృష్ణ మురళిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వంశీ భార్య కీలక ఆరోపణలు
Also Read: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఆసక్తికర సంఘటన
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For AndhraPradesh News And Telugu News