గోవాడ షుగర్స్‌లో మరో నాలుగు రోజులే క్రషింగ్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:06 AM
గోవాడ షుగర్స్‌లో ఈ నెల ఐదో తేదీ వరకే చెరకు క్రషింగ్ జరుగుతుందని యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. రైతులు తమపొలాల్లో వున్న చెరకు సత్వరమే ఫ్యాక్టరీకి తరలించాలంటూ అన్ని కాటాల వద్ద నోటీసులు అంటించారు. షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది జనవరి 21వ తేదీన రెగ్యులర్ క్రషింగ్‌ను ప్రారంభించారు.

5వ తేదీతో నిలిపివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటన
ఇంతవరకు 98 వేల టన్నుల చెరకు క్రషింగ్
చోడవరం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్స్‌లో ఈ నెల ఐదో తేదీ వరకే చెరకు క్రషింగ్ జరుగుతుందని యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. రైతులు తమపొలాల్లో వున్న చెరకు సత్వరమే ఫ్యాక్టరీకి తరలించాలంటూ అన్ని కాటాల వద్ద నోటీసులు అంటించారు. షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది జనవరి 21వ తేదీన రెగ్యులర్ క్రషింగ్‌ను ప్రారంభించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా క్రషింగ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. దీంతో ఫ్యాక్టరీ యార్డులో, కాటాల వద్ద చెరకు బండ్లతో రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సహనం నశించి కొన్నిసార్లు ఆందోళనలకు కూడా దిగారు. కాగా మంగళవారం నాటికి 98 వేల టన్నుల చెరకు క్రషింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పొలాల్లో అందుబాటులో ఉన్న చెరకు క్రషింగ్ చేస్తే మరో ఏడెనిమిది వేల టన్నుల వరకు క్రషింగ్ జరిగే అవకాశం వుంది.