నేడు మంత్రి నారా లోకేష్ రాక
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:12 AM
రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖపట్నం రానున్నారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖపట్నం రానున్నారు. సాయంత్రం 7.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి వెళతారు. అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటిరోజు (గురువారం) ఉదయం 10.15 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టుకు వెళతారు. తనపై తప్పుడు కథనం ప్రచురించిందని ‘సాక్షి’ దినపత్రికపై ఆయన గతంలో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు వెళతారు.