AP News: మంత్రి నారా లోకేష్ 60వ రోజు ప్రజాదర్బార్

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:58 AM

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్‌తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.

AP News: మంత్రి నారా లోకేష్ 60వ రోజు ప్రజాదర్బార్
Minister Nara Lokesh

విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తన రెండో రోజు పర్యటనలో సోమవారం ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 60వ రోజు ప్రజాదర్బార్ (60th Day Praja Darbar)నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి నారా లోకేష్ అర్జీలు (Petitions) స్వీకరించారు. కూటమి ప్రభుత్వం (Kutami Govt.) అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ (డీఎస్సీ నోటిఫికేషన్) పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్‌తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్‌ను అమలుచేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జెడ్ పీహెచ్ స్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని, సదరు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని విశాఖకు చెందిన రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయారు.

Also Read..: అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఓ వ్యక్తి హల్ చల్..


స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ డీటీగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ ఏఎస్ఆర్ జిల్లా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో పనిచేస్తూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న టి.అప్పారావు, ఈశ్వర్ రావులను తొలగించి అర్హులను నియమించాలని పాడేరుకు చెందిన ఎన్.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాము విశాఖ పెందుర్తిలోని సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్ లో 150 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామని, అయితే సదరు స్థలాన్ని అబిత్ రాజు అనే వ్యక్తి దౌర్జన్యం చేసి ఆక్రమించారని ఆర్.లక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని విన్నవించారు. ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖపట్నానికి చెందిన కె.సౌజన్య విజ్ఞప్తి చేశారు. ఆయా అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.


అచ్యుతాపురంలో మంత్రి లోకేశ్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేశ్‌ సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి బీచ్‌రోడ్డులోని హోటల్‌ నోవాటెల్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగించారు. ఉదయం 11.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడి లేపాక్షి కల్యాణమండపంలో ఎలమంచిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతిభ చూపిన కార్యకర్తలకు అవార్డులు ప్రదానం చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని రాత్రి 7.15 గంటలకు విజయవాడ వెళతారు.

కాగా మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం మధ్యాహ్నం విశాఖ నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్యెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖ, అనకాపల్లి పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, బత్తుల తాతయ్యబాబు, బుద్దా నాగజగదీశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి పీఎం.పాలెం క్రికెట్‌ స్టేడియంనకు చేరుకుని కుటుంబంతో కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ను తిలకించారు. తరువాత బంధువుల ఇంట్లో విందుకు హాజరైన లోకేశ్‌, రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..

బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 11:58 AM