Share News

సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:33 PM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు

విశాఖ పూర్ణామార్కెట్‌కు చెందిన వారుగా గుర్తింపు

అనంతగిరి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖపట్నం పూర్ణామార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు సరియా జలపాతాన్ని తిలకించేందుకు వచ్చారు. అయితే రెండో స్టెప్‌ జలపాతం అందాలను తిలకించి తిరిగి వెళుతుండగా.. మొదటి స్టెప్‌ డేంజర్‌ జలపాతం వద్దకు వచ్చేసరికి ఆరుగురులో వాసు, నరసింహ అనే ఇద్దరు యువకులు జారిపడి గల్లంతయ్యారు. వెంటనే వారిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం కావడంతో స్థానికులు అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన ఇద్దరు యువకుల వయస్సు 23 సంవత్సరాలోపు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోని గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:33 PM