Share News

Special Officers ప్రత్యేకాధికారుల నియామకం

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:29 PM

Appointment of Special Officers జిల్లాలో నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు ప్రతి శుక్రవారం మండలాల్లో పర్యటిస్తారని..అక్కడి అభివృద్ధిని పర్యవేక్షిస్తారని వెల్లడించారు.

 Special Officers  ప్రత్యేకాధికారుల నియామకం

పార్వతీపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు ప్రతి శుక్రవారం మండలాల్లో పర్యటిస్తారని..అక్కడి అభివృద్ధిని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. కాగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, కురుపాంకు డిప్యూటీ కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి, సాలూరుకు డ్వామా పీడీ కె.రామచంద్రరావును ప్రత్యేకాధికారులు నియమించారు. మండలాల వారీగా చూస్తే.. పాచిపెంటకు జిల్లా సూక్ష్మ సాగునీటి అధికారి వి.రాధాకృష్ణ, బలిజిపేటకు వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌, గరుగుబిల్లికి గ్రామీణ నీటి సరఫరా అధికారి ఓ.ప్రభాకరరావు, మక్కువకు ఉద్యాన శాఖాధికారి బి.శ్యామల, పార్వతీపురానికి గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఎం.సుధారాణిని నియమించారు. కొమ రాడకు భూగర్భజలాల అధికారి ఎ.రాజశేఖరరెడ్డి, సీతానగరానికి పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఐ.రాజేశ్వరి, సాలూరుకు జీసీసీ డీఎం వి.మహేంద్రకుమార్‌, పాలకొండకు పశు సంవర్థక శాఖ అధికారి ఎస్‌.మన్మథరావు, వీరఘట్టానికి ప్రణాళికాధికారి పి.వీరరాజు, గుమ్మలక్ష్మీప ురానికి ఐసీడీఎస్‌ పీవో టి.కనకదుర్గ, కురుపాంకు సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్‌.తేజేశ్వరరావు, సీతం పేటకు పాలకొండ డివిజన్‌ అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ, భామినికి డీఆర్‌డీఏ ఏపీడీ వై.సత్యం నాయుడు, జియమ్మవలసకు డీపీవో టి.కొండలరావు ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీకి జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి డి.మంజులవీణ, పార్వతీపురం మున్సిపాలిటీకి ఐటీడీఏ ఏపీవో ఏ.మురళీధర్‌, పాలకొండ నగర పంచాయతీకి సీతంపేట ఐటీడీఏ ఏపీవో జి.చినబాబు నియమితులయ్యారు.

Updated Date - Apr 08 , 2025 | 11:29 PM