Share News

పింఛన్‌ రూ.4వేలకు పెంచిన ఘనత బాబుదే

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:10 AM

పింఛన్‌ను రూ.2వేలు నుంచి రూ.4 వేలుకు పెంచిన ఘనత చంద్ర బాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

 పింఛన్‌ రూ.4వేలకు పెంచిన ఘనత బాబుదే

సాలూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పింఛన్‌ను రూ.2వేలు నుంచి రూ.4 వేలుకు పెంచిన ఘనత చంద్ర బాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరులోని తన నివాసంలో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించి, మా ట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింద న్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొ ని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో రూ.3లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు రూ.8వేల కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ.4వేల కోట్లు కేటాయించటం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేసిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎస్టీలకు రూ.75వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు అదనంగా పెంచి ఇస్తామని చెప్పారు. సోలార్‌ విద్యుత్‌, గాలి ద్వారా తయారు చేసే విద్యుత్‌ ను ప్రోత్సహించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం వస్తుందని అన్నారు. మే నెలలో ప్రతి రైతుకు డబ్బులు జమ అవుతా యని తెలిపారు. మార్చి నెలాఖరులోగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి), డబ్బి కృష్ణ, మక్కువ మండల అధ్యక్షుడు గుళ్ల వేణు, పరమేష్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 12:10 AM