బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగించాలి
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:45 AM
బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అంబే డ్కర్ అన్నారు.

- కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అంబే డ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఉన్నత స్థాయికి చేరిన బడుగు వర్గాలకు చెందిన అధికా రులు, ఉద్యోగులంతా తమ తోటి పేద కుటుంబాలకు చేయూత అందించాలని కోరారు. అదే జగ్జీవన్‌రామ్‌కు మనమిచ్చే గొప్ప నివాళి అని పేర్కొన్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని, విద్యార్థులు ఈ విష యాన్ని గుర్తించి విద్యతో ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. కార్యక్ర మంలో ఎమ్మెల్సీ రఘురాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, జేసీ సేతు మాధవన్, దళిత బహుజన శ్రామిక యానియన్ అధ్యక్షుడు చిట్టిబాబు, బీఎస్పీ నాయకుడు సోములు తదితరులు పాల్గొన్నారు.