Share News

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:58 PM

మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన ముగశాల స్రవంతి(19) ఇంటర్‌లో పరీక్ష తప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే బాధతో ఉరి వేసుకుని తనువు చాలించింది. పోలీసుల కథనం మేరకు.. స్రవంతి విశాఖ జిల్లా తగరపువలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదివింది. ఈ

 ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య
స్రవంతి (ఫైల్‌):

భోగాపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన ముగశాల స్రవంతి(19) ఇంటర్‌లో పరీక్ష తప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే బాధతో ఉరి వేసుకుని తనువు చాలించింది. పోలీసుల కథనం మేరకు.. స్రవంతి విశాఖ జిల్లా తగరపువలసలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదివింది. ఈనెల 12న వెలువడిన ఫలితాల్లో ఫెయిల్‌ అయినట్లు తెలుసుకుంది. కెమిస్ట్రీ సబ్జెక్టు తప్పింది. తను ఫలితం ఈ విధంగా వస్తుం దని ఊహించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇంటివద్ద ముభావంగా ఉం ది. ఆదివారం ఉదయం తల్లి శ్యామల విజయనగరం వెళ్లిం ది. తండ్రి సూరిబాబు గ్రామ సమీపంలో పొలం పనులకు వెళ్లాడు. నానమ్మ, తాతయ్యలు ఇంటి ఆరుబయట కూర్చొన్నారు. ఇంట్లోనే ఒంటరిగాఉన్న స్రవంతి మరింత కుమిలిపోయింది. స్నేహితులు ఉత్తీర్ణుల వ్వడం.. తాను పరీక్ష తప్పడంతో తీవ్రంగా బాధపడుతూ ఇంట్లో శ్లాబు ఉక్కుకు ఉరివేసుకుంది. ఆరుబయట కూర్చొన్న నానమ్మకు ఇంట్లో ఏదో వేలాడుతున్నట్లు కనిపించి లోపలికి వెళ్లి చూసింది. తట్టుకోలేక చుట్టు పక్కల వారిని పిలిచింది. వారంతా వచ్చేటప్పటికే స్రవంతి విగత జీవిగా మారింది.స్రవంతి భౌతికదేహం వద్ద తల్లిదండ్రుల రోదనచూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని కిందకు దింపి విచారించి సుందరపేట ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. స్రవంతికి తమ్ముడు నరితిన్‌ కుమార్‌ ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.పాపారావు తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 11:59 PM