Share News

మన కళాకారులకు ‘కందుకూరి’ పురస్కారాలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:17 AM

జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కా రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. కందుకూరి వీరేశలిం గం జయంతి సందర్భంగాఈ పురస్కారాలకు మన జిల్లా కళాకారులను ఎంపిక చేసింది.

మన కళాకారులకు ‘కందుకూరి’ పురస్కారాలు

  • నేడు విజయవాడలో ప్రదానం

విజయనగరం రూరల్‌/ రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కా రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. కందుకూరి వీరేశలిం గం జయంతి సందర్భంగాఈ పురస్కారాలకు మన జిల్లా కళాకారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమి టెడ్‌ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను ఈ నెల 16న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ప్రదానం చేయనున్నారు. విజయనగరం జిల్లా నుంచి ఎనిమిది మంది ఈ పుర స్కారాలకు ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో మీగడ మల్లికార్జున స్వామి (రాజాం), కేఎస్‌ఎన్‌ ఆచార్యబాబు (చీపురుపల్లి), జి.పైడిరాజు, దాసరి తిరుపతినాయుడు, వేమలి త్రినాథరావు, బత్తుల లక్ష్మి, కేవీ పద్మావతి, డి.మురళీధర్‌లు ఉన్నారు. వీరికి పురస్కారం కింద రూ.10 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందిం చనున్నారు. 2018లో చివరిసారిగా కందుకూరి వీరేశలింగం పేరిట పురస్కారాలు ఇచ్చారు. ఏడేళ్ల విరామం తరువాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రదానం చేయ నుంది. కందుకూరి పురస్కారానికి ఎంపికైన కళాకారులను జిల్లాకు చెందిన కళాకారులు, కళాభిమానులు అభినందించారు.

Updated Date - Apr 16 , 2025 | 12:18 AM