రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:20 AM
రైలు నుంచి జారిపడి ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడివరం సమీపంలో సోమ వారం చోటుచేసుకుంది.

సీతానగరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రైలు నుంచి జారిపడి ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడివరం సమీపంలో సోమ వారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అరుణ్ బెహరా(40) సీతానగరం నుంచి బొబ్బిలి రైల్వే స్టేషన్ల మధ్య గుమ్మడివరం సమీపంలో రైలు నుంచి జారిపడిపోయాడు. గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే పోలీస్ హెడ్ కాని స్టేబుల్ బి.ఈశ ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.