AP News: ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
ABN , Publish Date - Feb 11 , 2025 | 09:09 AM
అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజనులు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు.

అమరావతి: యాక్ట్ 1/70 (Act 1/70) మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తామని, ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం (State Govt.) కట్టుబడి ఉందని, గిరిజనులు (Tribal s) ఆందోళన చెందవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Gummidi Sandhyarani) అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు విషప్రచారం చేస్తూ.. అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 5 ఏళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారని, అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైఎస్సార్‌సీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు
అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, అంతరించి పోతున్న తెగలను కాపాడలనే లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివాసీలకు రక్షణ కల్పించడం మాట అటుంచి గిరిజనేతరులకు మాత్రం కాసుల పంట పండిస్తోంది. ఇదంతా అధికార యంత్రాంగం ఎదుటే జరుగుతున్నా ఏనాడు అడ్డుకున్న పాపనపోలేదని గిరిజనులు వాపోతున్నారు. అంతేకాదు కొంతమంది గిరిజన నాయకుల అవతారం ఎత్తి అక్రమార్కులతో లాలుచి వ్యవహరం నడుపుతుండడంతో మెజార్జీ భూ కమతాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా బలమున్నోడిదే రాజ్యం అన్నట్లుగా అమాయక ఆదివాసీలను రుణాల పేరుతో ట్రాప్ చేసి కోట్లాది రుపాయల విలువైన భూములను సొంతం చేసుకుటున్నారు. అనంతరం దర్జాగా క్రయవిక్రయాలు జరుపుతూ రెండు చేతులా ఆర్జిస్తున్న పరిస్థితి షరా మాములుగా తయారైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..
గోల్డ్ ధర ఎందుకు పెరిగింది.. ఇన్వెస్ట్ చేయాలా వద్దా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News