బకాయిలు చెల్లించక.. రసీదులు ఇవ్వక
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:45 PM
:గజపతినగరం, పురిటిపెంట పంచాయతీల్లో ఆశీలునిర్వహణ గాడితప్పుతోంది.ప్రధానంగా పాట దారులు బకాయిలు చెల్లించకపోవడంతో పంచాయతీల ఆదాయానికి గండిపడుతోంది. అంతేకాకుండా ఆశీలు నిర్వాహకులు రసీదులు ఇవ్వ డంలేదని వ్యాపారులు వాపోతున్నారు.

గజపతినగరం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి):గజపతినగరం, పురిటిపెంట పంచాయతీల్లో ఆశీలునిర్వహణ గాడితప్పుతోంది.ప్రధానంగా పాట దారులు బకాయిలు చెల్లించకపోవడంతో పంచాయతీల ఆదాయానికి గండిపడుతోంది. అంతేకాకుండా ఆశీలు నిర్వాహకులు రసీదులు ఇవ్వ డంలేదని వ్యాపారులు వాపోతున్నారు.
రికవరీ చేయకపోవడంతో..
గజపతినగరంతోపాటు పురిటిపెంట పంచాయతీలకు ఆశీలవేలం పాటద్వారా ఏటా రూ.లక్షల్లో ఆదాయం గండిపడుతోంది. పాటదారులు సిండికేట్ కావడంతో ఏటేటా వేలం మొత్తాన్ని తక్కువకు పాడుతున్నారు. అయితే పాడిన మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్లు చెల్లించడంలేదని పం చాయతీ అధికారులు చెబుతున్నారు. ప్రతిఏటా ఆశీలుపాట పాడిన పాటదారులు ఏడాదికాలంలో వసూలు చేసుకున్నా పంచాయతీలకు మాత్రం బకాయిలు చెల్లించడంలేదు. పంచాయతీ అధికారులు నిబం ధనల ప్రకారం పాట నిర్వహించకపోడం వల్లే బకాయిలు పేరుకుపోతు న్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకఏడాది పాడిన పాటదారుడు నిబంధనల ప్రకారం ఆశీల సొమ్ముమూడు విడతల్లో చెల్లించాలి. పంచాయతీలకు బకాయిలు చెల్లించక రెండో ఏడాది పాటసమయానికి తప్పుకుంటున్నారు.ఈనేపథ్యంలో పంచాయతీ అధికారులు బకాయి దారులకు నోటీసులిచ్చి వారి నుంచి రికవరీ చేయకపోవడంతో ఏటా లక్షలాది రూపాయలు ఆదాయానికి గండిపడుతోంది. ప్రధానంగా గజపతినగరంలోని చంపావతి వంతెన నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు జాతీయరహదారికి ఇరువైపులా ఉన్న షాపుల నుంచి, కూరగా యలు, చేపల మార్కెట్, వాహనాల లోడింగ్, అన్‌లోడింగ్ ఇసుక బళ్లు, ట్రాక్టర్లు తదితర వాటిపై ఆశీలు రూపంలో వసూళ్లు చేస్తుంటారు. అయితే రెండు పంచాయతీల్లోనూ ఆశీలు వసూళ్లు చేస్తున్న వారు తమకు ఎటువంటి రశీదులు ఇవ్వడంలేదని వ్యాపారులు చెబుతున్నా రు.వ్యాపారాలు ఆధారంగా, వాహనాల లోడింగ్ అన్ లోడింగ్‌కు సంబందించి ధరల పట్టికను పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని, ఆవిధంగా చేయడంలేదని ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువస్తే తట్టకు రూ. 10 వసూళ్లు చేయడం శోచనీయమని రైతులు వాపోతున్నారు
ఇదీ పరిస్థితి
గజపతినగరం పంచాయతీకి సంబందించి 2019-20 నుంచి 2023- 24వరకు ఆరుగురు పాటదారులు ఆశీలవేలంపాటపాడగా పంచాయితీకి 14లక్షల 70వేలు రావల్సిఉంది. అయితే ఇంతవరకు 8,86,500 చెల్లించగా 5,83, 500బకాయిలు చెల్లించాల్సిఉంది. పురిటిపెంట పంచాయతీకి సంబందించి 2016-17నుంచి 2024-25వరకు 17,18,500 పాటదారుల నుంచి ఆశీలుపాట ద్వారా రావల్సిఉన్నా ఇంతవరకు 5,80, 750 పం చాయతీకి జమకాగా బకాయిలు 11,37,750 చెల్లించాల్సి ఉంది.
బకాయిదారులకు నోటీసులిచ్చాం
పాత బకాయిలు చెల్లించాలని పంచాయతీ అధికారులకు సూచించా మని ఈవోపీఆర్డీ సుగుణాకరరావు తెలిపారు. గజపతినగరం పంచా యతీకి సంబందించి 5లక్షల83వేలు, పురిటిపెంట పంచాయతీకి 11లక్షల 37వేల బకాయిలు రావల్సిఉందని చెప్పారు. బయిలు పెట్టిన పాటదా రులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.