Rapidly శరవేగంగా..
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:34 PM
Rapidly పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిఽధిలోని గిరిజన గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణాలు చురుగ్గా జరుగు తున్నాయి. దశాబ్దాలుగా బీటీ రహదా రులకు నోచని ఏజెన్సీలోని మారుమూల, మైదాన ప్రాంతాలు కొత్త రూపును సంతరించుకుం టున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

కొత్త రూపును సంతరించుకుంటున్న గిరిజన గ్రామాలు
సర్వత్రా హర్షాతిరేకాలు
పార్వతీపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిఽధిలోని గిరిజన గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణాలు చురుగ్గా జరుగు తున్నాయి. దశాబ్దాలుగా బీటీ రహదా రులకు నోచని ఏజెన్సీలోని మారుమూల, మైదాన ప్రాంతాలు కొత్త రూపును సంతరించుకుం టున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో గిరిజనుల కల సాకారమవుతుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణలు రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లా పరిస్థితిని సీఎం చంద్రబాబునాయుడుకు తెలియజేస్తూ.. నిధులు మంజూరు చేయిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా గిరిజన ప్రాంతాల్లో శరవేగంగా రహదారుల నిర్మాణం జరుగుతోంది. గతంలో మధ్యలో నిలిచిపోయిన రహదారుల పనులు కూడా పునఃప్రారంభం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవతో తమకు రహదారి కష్టాలు తీరాయని పలువురు చెబుతున్నారు. వాస్తవంగా గిరిశిఖర గ్రామాలకు రహదారుల సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక చదువుకు దూరమయ్యేవారు. మరోవైపు అత్యవసర వేళల్లో వైద్య సేవలు అందేవి కావు. డోలీ మోతలు కూడా తప్పేవికావు. అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో కొంతవరకు ఆ కష్టాలు తొలగినట్టేనని గిరిజనులు చెబుతున్నారు.
అభివృద్ధి పనులు ఇలా..
జిల్లాలో 198 బీటీ రహదారుల పనులను రూ.112.65 కోట్లతో చేపడుతున్నారు. రూ.39.43 కోట్లతో 479 సీసీ రోడ్లును, రూ.5.32 కోట్లతో 1276 గోశాలలను నిర్మిస్తున్నారు. మరో రూ.18.32 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవి కాకుండా మరికొన్ని పనుల నిధులు కోసం ప్రతిపాదనలు వెళ్లాయి.