Share News

Not Deposited ఇంకా జమకాలే..

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:27 PM

Still Cash Not Deposited ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న వివిధ నిర్మాణాలకు ఇంకా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో నిధుల విడుదల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. జిల్లాలో ఉపాధి కూలీలకు ఇప్పటికీ వేతనాలు జమకాలేదు. అదేవిధంగా ప్రహరీ పనులు పూర్తయినా నిధులు చెల్లింపులు కాలేదు.

  Not Deposited ఇంకా జమకాలే..

గరుగుబిల్లి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న వివిధ నిర్మాణాలకు ఇంకా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో నిధుల విడుదల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. జిల్లాలో ఉపాధి కూలీలకు ఇప్పటికీ వేతనాలు జమకాలేదు. అదేవిధంగా ప్రహరీ పనులు పూర్తయినా నిధులు చెల్లింపులు కాలేదు. 15 మండలాల పరిధిలో 323 ప్రహరీలకు రూ. 2.47 కోట్లు, వేతనాలతో పాటు పలు నిర్మాణాలకు రూ. 43.89 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిధులు జమకాకుంటే మరికొంత సమయం ఎదురు చూడాల్సిందేనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ‘ఉపాధిలో నిర్వహించిన పనులకు బిల్లులు సిద్ధం చేశాం. నిధులు సమకూరిన వెంటనే ఉన్నతాధికారులు స్లాట్‌ కేటాయిస్తారు. ఏప్రిల్‌ మొదటి వారంలోగా చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. ఉపాధి వేతనదారులకు సంబంధించి రెండు వారాలకు చెందిన మొత్తాలు జమయ్యాయి. డిసెంబరు- మార్చి వరకు వేతనాలు జమ కావాల్సి ఉంది. నిధుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.’ అని డ్వామా పీడీ కె.రామచంద్రరావు తెలిపారు.

వేతనం పెంపు!

ఉపాధి వేతనదారులకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రూ. 7 మేర వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత సగటు వేతనం వారికి రూ. 300 ఉండగా.. దానికి అదనంగా రూ. 7కలపనున్నారు. మొత్తంగా ఉపాధి కూలీలు ఇకపై వేతనంగా రూ. 307ను అందుకోనున్నారు. దీనిపై డ్వామా పీడీ కె.రామచంద్రరావును వివరణ కోరగా.. వేతనం పెంపుపై అధికారికంగా తమకు సమాచారం అందలేదన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే వేతనం పెంపు అమలు చేస్తామని వెల్లడించారు.

Updated Date - Mar 30 , 2025 | 11:27 PM