Share News

సమ్మె హామీలు అమలుచేయాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:05 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముని సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు.

సమ్మె హామీలు అమలుచేయాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు :

బెలగాం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ హయాంలో ముని సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. బుధవారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ముని సిపల్‌ పారిశుధ్య కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు జి.వెంకటరమణ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో సేవలు అందజేస్తున్న కార్మికులకు రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలని డిమాండ్‌ చేశారు. వారికి రిటైర్మెంట్‌ తర్వాత ఇచ్చే సదుపాయాలను కార్మికులకు కల్పించాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాకల సన్యాసిరావు, బీవీ రమణ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:05 AM