Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:16 AM

ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం
అర్జీదారుడితో మాట్లాడుతున్న తోయక జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమస్యను ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఏదిఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:16 AM