పశువుల దాహార్తిని తీర్చేందుకు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:04 AM
వేసవి దృ ష్ట్యా పశు పక్షాదుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టెల నిర్మాణాన్ని తలపెట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): వేసవి దృ ష్ట్యా పశు పక్షాదుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టెల నిర్మాణాన్ని తలపెట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. చెముడు గ్రామంలో ఆమె మంగళవారం నీటితొట్టెల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎంపీడీవో సాల్మన్‌రాజ్, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, టీడీపీ మండల కన్వీనర్ పాడి సుదర్శన్, అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: వెంకంపేట గ్రామంలో ఉపాధి నిధులతో పశువుల కోసం నిర్మించ తలపెట్టిన తాగునీటి తొట్టెలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం భూమి పూజ చేశారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
పార్వతీపురం పట్టణంలోని ఆరో వార్డు నవిరి కాలనీలో ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మంగళవారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు ఉన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాల యం ఎదుట ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని, అలాగే మున్సి పల్ కేంద్రంలో శుద్ధినీటి కేంద్రాన్ని ప్రారంభించా రు.
బొబ్బిలి రూరల్: పశువులకు పశుగ్రాసంతో పాటు తాగు నీటిని అందజేసేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నీటితొట్టెలు మంజూరు చేస్తోందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. మంగళవారం కొత్తపెంట గ్రామంలో నీటితొట్టెల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో పి.రవికుమర్, ఆవోపీఆర్డీ భాస్కరరావు, ఉపాధి ఏపీవో లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.
వీరఘట్టం: కంబర గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు మంగళవారం పశువుల నీటితొట్టె పనులను ప్రారంభించారు. ఏపీవో జి.సత్యంనాయుడు పాల్గొన్నారు.
బలిజిపేట: తుమరాడలో నీటితొట్టెల ఏర్పాటుకు మంగళవారం స్థానిక అధికారులు శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో నగేష్, ఏపీవో కేశవరావు, ఈవోపీఆర్‌డీ పుష్పారావు తదితరులు పాల్గొన్నారు.