Share News

ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:57 PM

తిరుపతిలో గోవుల మృతిపై వైసీపీ నాయకులు లేనిపోని ప్రకటనలు చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు విమర్శించారు. ఆదివారం చీపురుపల్లిలోని విలేకరులతో మాట్లాడుతూ భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పలు కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ
చీపురుపల్లి: మాట్లాడుతున్న రామ్‌మల్లిక్‌నాయుడు::

చీపురుపల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో గోవుల మృతిపై వైసీపీ నాయకులు లేనిపోని ప్రకటనలు చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు విమర్శించారు. ఆదివారం చీపురుపల్లిలోని విలేకరులతో మాట్లాడుతూ భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పలు కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తాళిబొట్లు, ప్లాస్మా టీవీలు, డాలర్లు మాయంకావడంతోపాటు దర్శనం టికెట్లలో అవినీతి జరిగిందని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో స్వామివారి ప్రసాదాలను కూడా దారి మళ్లించిన ఘనత ఆయనదేనన్నారు. అటువంటి వ్యక్తి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత పాలకుల హయాంలో దేవస్థానం ప్రతిష్ట దిగజారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర ప్రజలకు ఆపారమైన నమ్మకం ఉందన్నారు.ఆడవారిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త కిరణ్‌పై తక్షణమే చర్యలు తీసుకుని చంద్రబాబు తన నిబద్ధతను నిరూపించుకున్నారన్నారు. సమావేశంలో కామునాయుడు, రామచంద్రుడు, బలరాం, సురేష్‌, ఇజరోతు రాంబాబు, మొగసాల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:57 PM