ప్రత్తికోళ్లలంకలో అంతుపట్టని జ్వరాలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:37 AM
ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్ల లంక జ్వరాలతో అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఏలూరురూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్ల లంక జ్వరాలతో అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా జ్వరం ఆరంభమై తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, వాపు వంటి లక్షణాలతో జనం ఆందోళన చెందుతున్నారు. వయ స్సుతో సంబంధం లేకుండా జ్వరం, తల నొప్పి, గొంతునొప్పి లక్షణాలతో బాధపడు తున్నారు. విపరీతమైన ఎండ, వేడిమి, ఉక్కపోత, అంతలోనే వర్షంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఈ జ్వరాలు వైద్య ఆరోగ్య శాఖకు అంతుపట్టకుండా ఉన్నాయి. తీవ్ర జ్వరంతోపాటు కీళ్ళ నొప్పులు వస్తుండడం చూసి తొలుత చికున్‌గున్యా అనుకున్నారు. ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి వెంటనే సోకుతుండడంతో ఆందోళన చెందుతు న్నారు. ప్రతీ ఇంటా జ్వర పీడితులు ఉన్నా రు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితిని దెం దులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. గుడివాకలంక పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ ఆనంద్ నేతృత్వంలో బుధవారం ప్రత్తి కోళ్లలంకలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిం చారు. సుమారు 150 మందికి రక్త పరీక్షలు నిర్వ హించగా ఐదుగురికి జ్వర తీవ్రత ఉన్నట్టు గుర్తించారు. మందులు అందజేశారు. గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. ఎంపీడీవో వెన్నా శ్రీలత, టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు, కొల్లేరు సీనియర్ నాయకుడు సైదు సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.