గాలి.. వాన..
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:51 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల ఆదివారం రాత్రి వర్షం కురిసింది. రాత్రి సుమారు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

తడిచిన ధాన్యం రాశులు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల ఆదివారం రాత్రి వర్షం కురిసింది. రాత్రి సుమారు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం రాశులు ముద్దయ్యాయి. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. తాడేపల్లిగూడెం, భీమవరం, గణపవరం, తణుకు, ఉండి, పెనుమంట్ర, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
కైకలూరు రైల్వేస్టేషన్‌లో చెట్టు విరిగి పడడంతో ఆదివారం రాత్రి 8:45 గంట లకు తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్ మూడు గంటల పాటు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో రెండో ప్లాట్‌ఫామ్‌పై నరసాపూర్ నుంచి చర్లపల్లి వెళ్లే స్పెషల్ ట్రైన్ కూడా నిలిచిపోయింది. ఎవరికి ప్రమాదం జరగక పోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.