Share News

జన్మతః దేశభక్తురాలు

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:54 AM

తల్లి గర్భంలో ఉండగానే పసల కృష్ణభారతి స్వాతం త్ర్యోద్యమంలో భాగస్వామి అయ్యారని, జైల్లోనే పుట్టడం ద్వారా జన్మతః దేశభక్తురాలు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

జన్మతః దేశభక్తురాలు
సంస్మరణ సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తల్లి గర్భంలో ఉండగానే పసల కృష్ణభారతి స్వాతం త్ర్యోద్యమంలో భాగస్వామి అయ్యారని, జైల్లోనే పుట్టడం ద్వారా జన్మతః దేశభక్తురాలు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు, గాంధేయవాది పసల కృష్ణభారతి సంస్మ రణ సభ ఆదివారం తాడేపల్లిగూడెంలో కుటుంబ సభ్యు లు, అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఆమె చిత్ర పటం వద్ద గాంధేయవాదులు, నాయకులు, అధికారులు నివాళులర్పించారు. సభలో మంత్రి నిమ్మల రామానా యుడు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న సందర్భంలో పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు చెరశాలలో ఉన్నప్పుడు జన్మించిన కృష్ణ భారతి గాంధేయ వాదిగా, సంఘసంస్కర్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఆదర్శ జీవితం సాగించారని కొనియాడారు. కలెక్టర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి కుటుంబ చరిత్ర తెలుసుకుంటుంటే రోమాలు నిక్కబొడుచుకుం టాయన్నారు. కృష్ణభారతి నిరాడంబర జీవితం గడిపిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. కార్యక్రమంలో విజయ నగరం ఎంపీ కె.అప్పలనాయుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజమౌళి, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుం దరరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, ఐజేయూ జాతీయ కార్యదర్శి దూసనపూడి సోమసుందర్‌, బుద్దాల రామారావు, భోగిరెడ్డి ఆదిలక్ష్మి తదితరులు కృష్ణభారతి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు.

Updated Date - Apr 14 , 2025 | 12:54 AM