బడి పిల్లలకు పుస్తకాల బరువు తగ్గింది
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:45 AM
కూటమి సర్కార్ బడి పిల్లలకు పుస్త కాల బరువు తగ్గించారు. గతంలో ఉన్న పుస్తకాలను తగ్గిస్తూ కొత్త పుస్తకాలను అందించేందుకు రంగం సిద్ధం చేశారు.

తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): కూటమి సర్కార్ బడి పిల్లలకు పుస్త కాల బరువు తగ్గించారు. గతంలో ఉన్న పుస్తకాలను తగ్గిస్తూ కొత్త పుస్తకాలను అందించేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో 1 నుంచి 9వ తరగతి వరకూ 223 టైటిల్స్ ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ సంఖ్యను 170కి కుదిం చింది. 53 టైటిల్స్ కుదింపునకు గురయ్యాయి. దీంతోపాటు ఆ పుస్తకాలు రెండు సెమిస్టర్స్‌గా భాగించి విద్యార్థులు ఏడాదికి సరిపడా పుస్తకా లన్నింటిని మొదటి రోజునుంచే మోసుకెళ్లే అవసరం లేకుండా చూస్తోంది. పాత పుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచి పనికి రావని అధికారులు చెబుతున్నారు. జిల్లా పాఠ్య పుస్తకాల విక్రయ కార్యాలయానికి మూడో వం తు పుస్తకాలు చేరగా నెలాఖరుకు నూరుశాతం పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరవేసేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు.
జిల్లాకు 4.50 లక్షల పుస్తకాలు..
ఉమ్మడి పశ్చిమ జిల్లాకు 12,44,864 పుస్తకా లు అందించాల్సి ఉండగా ఇప్పటికే జిల్లాకు 4,46,911 పుస్తకాలు చేరాయి. మరో పది రోజు ల్లో నూరుశాతం పుస్తకాలు చేరేవిధంగా ఉన్న తాఽధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలా కాకుండా పుస్తకాలు బరువు తగ్గించి పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మార్పులు చేపట్టారు.
సిలబస్ ఒకటే.. పుస్తకాల మార్పు..
గతంలో మాదిరిగానే సిలబస్ ఉంటుంది కానీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పుస్తకా లను సిద్ధం చేశారు. ఈ పుస్తకాలు అంతా ఆధునీకరించిన టైటిల్స్‌తో విద్యార్థులకు నూత నంగా అందించేవిధంగా తీర్చిదిద్దారు. ఒకటో తరగతి విద్యార్థులకు తెలుగు లెక్కలు, ఇంగ్లీష్ ఒఝేపుస్తకం కేటాయించారు. దీంతో ఒకే పుస్తకంలో తెలుగు, ఇంగ్లీష్ లెక్కలు చదువుకు నే వీలుంటుంది. దీంతో విద్యార్థులకు రెండు పుస్తకాలతోనే చదువుకోవచ్చు.
బుక్ డిపో ద్వారానే..
పాఠ్యపుస్తకాలు గతంలో 1 నుంచి 7వ తరగతి వరకూ జిల్లా బుక్ డిపో నుంచి అందించగా 8,9,10 తరగతులకు ఎంఈవోల నుంచి నేరుగా పాఠశాలలకు అందించేవారు. తాజాగా 1 నుంచి 10వ తరగతి వరకూ బుక్ డిపోల నుంచే పాఠశాలలకు అందించే ఏర్పాట్లు చేసినట్టు బుక్ డిపో మేనేజర్ టి.భాస్కరరావు తెలిపారు.