Share News

కరెంట్‌ కష్టం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:48 AM

ఈదురు గాలుల ఇక్కట్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో సోమవారం రాత్రి కైకలూరు మండలంలోని అనేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.

కరెంట్‌ కష్టం
గుడివాడ రూరల్‌ మండలం మోటూరు వద్ద కుప్పగూలిన విద్యుత్‌ టవర్‌

ఈదురు గాలులతో కూలిన చెట్లు, విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

అంధకారంలో గ్రామాలు..

మరో మూడు రోజులు ఇబ్బందులే..

కైకలూరు / ముదినేపల్లి / కలిదిండి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఈదురు గాలుల ఇక్కట్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో సోమవారం రాత్రి కైకలూరు మండలంలోని అనేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రాత్రి 9 గంటల సమయంలో ఏలూరు నుంచి కైకలూరు ప్రధాన లైన్‌లో జంపర్లు తెగి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి ఒంటి గంట సమయం లో కైకలూరుకు, 3 గంటల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు విద్యుత్‌ సరఫరా అందజేశారు. గుడివాడ మండలం లింగవరం నుంచి 220/133కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి ముదినేపల్లి మండలం చిగురుకోటకు ప్రధాన విద్యుత్‌ మార్గం టవర్ల ద్వారా ఏర్పాటు చేశారు. గుడివాడ రూరల్‌ మండలం మో టూరు వద్ద ఒక టవర్‌ విరిగి చెరువులోకి కూలిపోయింది. కైకలూరు నియోజకవర్గంలో గృహావసరాలకు 90 శాతం విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్టు విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఆక్వా రైతంగానికి 30 శాతం సమస్య ఉందని వాటిని కూడా త్వరితగతిన అధిగమించేలా పనులు నిర్వహి స్తున్నట్లు కైకలూరు విద్యుత్‌శాఖ ఏడీఏ రామయ్య తెలిపారు.

ముదినేపల్లి మండలంలో చిగురుకోట 132 కేవీ సబ్‌ స్టేషన్‌కు అనుసంధానంగా కొత్తపల్లి, సింగరాయపాలెం, చిగు రుకోట 33 కేవీ, 11 కేవీ సబ్‌ స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నప్పటికీ మూడు రోజుల వరకు పూర్తిస్థాయి విద్యుత్‌ సరఫరా కాదని అధికారులు చెబుతున్నారు. అన్నవరం, కొత్తపల్లి, బొమ్మినంపాడు, అల్లూ రు తదితర గ్రామాల్లో చెట్లు కూలి తెగిన విద్యుత్‌ లైన్ల పున రుద్ధరణతో పాటు, చిగురుకోట సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ లైన్ల మరమ్మతులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు ఏఈ పూర్ణచంద్రరావు తెలిపారు.

వనామికి విద్యుత్‌ షాక్‌

కలిదిండి మండలంలో రాత్రంతా విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. పలు గ్రామాల్లో చెరువుల్లో ఏరియేటర్లు స్థంభించి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. రొయ్యలు మృత్యువాత పడటంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. చిన్న సైజు రొయ్యలు చనిపోతుండటంతో ఆకివీడు, ఏలూరు మార్కెట్‌ అయినకాడికి అమ్ముకుంటున్నారు. విద్యుత్‌ సరఫరా అంతరా యంతో రైతులు జనరేటర్లను అద్దెకు తెచ్చి ఏరియేటర్లను తిప్పుతున్నారు. ట్రంప్‌ సుంకం దెబ్బ నుంచి కోలుకుంటున్న తరుణంలో రొయ్యలు పెద్ద సైజు కాకుండానే చనిపోతుండ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:48 AM