Share News

పాఠశాలల్లో ల్యాబ్‌లకు పరికరాల పంపిణీ

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:42 AM

విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు పాఠశాల సైన్స్‌ ల్యాబ్‌లకు పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ తెలిపారు.

పాఠశాలల్లో ల్యాబ్‌లకు పరికరాల పంపిణీ
సైన్స్‌ పరికరాలు పంపిణీ చేస్తున్న ఎంపీ మహేశ్‌

మెరుగైన ఫలితాలు సాధించాలి : ఎంపీ మహేశ్‌

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు పాఠశాల సైన్స్‌ ల్యాబ్‌లకు పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ తెలిపారు. 10వ డివిజన్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2 కోట్లు విలువైన పరికరాలను అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, జడ్పీ చైర్మన్‌ గంటా పద్మశ్రీ, ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి, ఎస్పీ కె.ప్రతాప్‌శివకిశోర్‌, డీఈవో వెంకటలక్ష్మమమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.

పేదల ఆరోగ్యానికి భరోసా

పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని ఎంపీ పుట్టా మహేశ్‌ అన్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీల ద్వారా 60 మందికి రూ.58.47 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం కోసం చిత్త శుద్ధితో పని చేస్తున్నామన్నారు. ప్రాణపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇప్పటి వరకు ఎంపీ కార్యాలయం ద్వారా రూ.2కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశామన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా ఎంపీ కార్యాలయానికి వచ్చి సహాయం కోరవచ్చన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ గంటా పద్మాశ్రీ ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ గారపాటి రామసీత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:42 AM