చేపల వేట నిషేధం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:48 AM
సముద్రంలో చేపల వేట నిషేధిస్తూ ప్రభు త్వ ఉత్తర్వులు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలోకి రానున్నాయి. జూన్ 15 వరకు అంటే 60 రోజులు పాటు చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

నేటి నుంచి జూన్ 15 వరకు అమలు
మత్స్యకారులకు నెలకు రూ.10 వేల భృతి
నరసాపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేట నిషేధిస్తూ ప్రభు త్వ ఉత్తర్వులు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలోకి రానున్నాయి. జూన్ 15 వరకు అంటే 60 రోజులు పాటు చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. బోటు నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. వేటకు వెళ్లిన బోట్లన్ని తీరానికి చేరుకుం టున్నాయి. సముద్రంలో ఉన్న బోట్లకు అంతర్వేది లైట్ హౌస్ నుంచి వైర్‌లైస్ సెట్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. 60 రోజల పాటు 1780 మంది మత్స్య కారులకు ఉపాధి ఉండదు. ఐస్ ఫ్యాక్టరీ, మత్స్య ఎగుమతి కంపెనీ కార్మికులు, లారీ డైవర్లు కూడా తాత్కాలికంగా ఉపాధి కోల్పోనున్నారు.
పునరుత్పత్తిని పరిరక్షించేందుకు
ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా సముద్ర వేటను కేం ద్ర ప్రభుత్వం నిలిపివేస్తుంది. ఈ రెండు నెలల కాలంలో మత్స్య సంపద పునరు త్పత్తి జరుగుతుంది. ఈ సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించి పోతుందని, ముందస్తు జాగ్రత్తతో వేట నిలిపివేస్తారు. జిల్లాలో నరసా పురం, మొగల్తూరు మండలంలో సముద్ర తీరం విస్తరించి ఉన్న 19 కిలోమీటర్ల పరిధిలో నిషేధ ఆజ్ఞలు అమలోకి వస్తున్నాయి.
1770 మందికి భృతి
నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం నెలకు రూ 10 వేలు భృతి అందించనుంది. జిల్లాలో ప్రస్తుతం 1780 మంది గుర్తింపు పొందిన మత్స్యకారులు ఉన్నారు. మే, జూన్ భృతి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. గత ఏడాది వరకు నిషేధ సమయంలో కేవలం రూ.10వేలు అందేది. కూటమి ప్రభుత్వం రూ.20వేలకు పెంచారు.