Stock Market Today: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:53 PM
Stock Market Today: ట్రంప్ టారిఫ్ దెబ్బకు నిన్న భారీ పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ లాభాల్లోనే కొనసాగాయి. బిఎస్‌ఈలో సెన్సెక్స్ 1089.18 పాయింట్లు పెరిగి 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో NSEలో నిఫ్టీ374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.

Stock Market Today: ట్రంప్ టారిఫ్ బాంబుకు నిన్న కుదేలైన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ దేశాలతో అగ్రరాజ్యం సంప్రదింపులకు సై అని సంకేతం ఇవ్వడంతో.. ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు బాగా రాణించాయి. ట్రేడింగ్ వారంలో రెండవ రోజు మొదలైనప్పటి నుంచి లాభాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. RBI రెపో రేటు నిర్ణయం వెలువడకముందే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగియడం విశేషం. ఉదయం బిఎస్‌ఈలో సెన్సెక్స్ 74,013.73 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఓ దశలో 74,859.39 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకాయి సూచీలు. చివరికి 1089.18 పాయింట్ల లాభంతో 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో, NSEలో నిఫ్టీ 374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.
ఈ రోజు ట్రేడింగ్ సమయంలో జియో ఫైనాన్షియల్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటి జాబితాలో ఉన్నాయి. అన్ని రంగాలూ గ్రీన్‌లో ట్రేడయ్యాయి. మూలధన వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, చమురు & గ్యాస్, PSU, రియాల్టీ, టెలికాం, మీడియా 2-4 శాతం మధ్య లాభపడ్డాయి. బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2-2 శాతం చొప్పున పెరిగాయి. .పవర్ గ్రిడ్ షేర్లు మాత్రం ఇంకా టాప్ లూజర్స్ జాబితాలోనే ఉన్నాయి. సోమవారం నాడు డాలరుకు 85.84గా ఉన్న భారత రూపాయి మారకం విలువ మంగళవారం నాడు 86.27 గా ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.4.50 లక్షల కోట్లు పెరిగింది.