UPI Payments: మీ యూపీఐ చెల్లింపులు ఫెయిల్ అవుతున్నాయా..ఓసారి ఇవి చెక్ చేయండి
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:43 PM
దేశంలో యూపీఐ చెల్లింపుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో పలుమార్లు మీ UPI చెల్లింపులు విఫలమవుతుంటాయి. అలాంటి క్రమంలో పలు విషయాలను పరిశీలించాలని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరిగింది. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులు చేసే క్రమంలో అప్పుడప్పుడు పలు రకాల సమస్యలు ఏర్పడతాయి. కొన్నిసార్లు, UPI ద్వారా చెల్లింపులు ఫెయిల్ అవ్వడం లేదా పలు రకాల ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు ముందుగా ఆందోళన చెందకుండా వాటికి గల కారణాలను తెలుసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఇంటర్నెట్ కనెక్షన్
ముందుగా మీరు యూపీఐ లావాదేవీలను చేసే క్రమంలో అవ్వకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. చెల్లింపు చేసే సమయంలో కనెక్టివిటీ సమస్యలు ఉంటే, అవి విఫలమవడానికి కారణం కావచ్చు. పలు మార్లు, నెట్‌ఫ్లిక్స్ లేదా ఇతర heavy appsను ఉపయోగించినప్పుడు, UPI లావాదేవీకి సరైన బాండ్‌విడ్త్ నెట్ అందదు. అలాంటి సందర్భాలలో మీరు ఫోన్‌కి ఆన్ చేయగలిగే ఎయిర్‌ప్లేన్ మోడ్ ఒక మంచి పరిష్కారం అవుతుంది. ఇది కనెక్టివిటీని రిఫ్రెష్ చేస్తుంది.
రిసీవర్ వివరాల నిర్ధారణ
యూపీఐ ద్వారా చెల్లింపు చేసే క్రమంలో ముందుగా, రిసీవర్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అంటే స్కానర్ కనిపించింది కదా అని స్కాన్ చేసి చెల్లింపులు చేయోద్దు. అవి పనిచేస్తున్నాయా లేదా, దేనికి స్కాన్ చేయాలనే వివరాలను తప్పక నిర్ధారించుకోవాలి. అంతేకాదు మీరు ఏదైనా నంబర్లకు చెల్లింపులు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క నంబర్ తప్పుగా నమోదైనా కూడా ఆ చెల్లింపు జరగదు. అలాంటి సందర్భాలలో నంబర్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
రోజువారీ పరిమితి
అంతేకాదు యూపీఐ ద్వారా రోజువారీ ట్రాన్సాక్షన్ల పరిమితి కూడా చాలా కీలకం. భారతదేశంలో UPI లావాదేవీలపై NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన నిబంధనల ప్రకారం, యూజర్లు ఒక రోజులో లక్ష వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరు. కానీ కొంత మంది ప్రత్యేక యూజర్లకు 5 లక్షలు వరకూ అనుమతించబడతాయి. మీరు మీ బ్యాంకు ఖాతా ద్వారా రోజువారీ పరిమితిని తెలుసుకని చేయడం ఉత్తమం. మీ పరిమితి దాటితే మీ చెల్లింపులు సక్సెస్ కాకపోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఒక కొత్త పరికరాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే, మొదటి 24 గంటల్లో మీరు రోజు రూ. 5000 మాత్రమే లావాదేవీ చేయగలరు.
సర్వర్ సమస్యలు
యూపీఐ యాప్ లేదా బ్యాంకు సర్వర్లో అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి. ఈ సర్వర్ సమస్యల వల్ల చెల్లింపులు విఫలమవుతాయి. ఇలా జరిగితే, మీరు ఒకే సమయంలో రెండు లేదా మూడు వేర్వేరు UPI యాప్‌లు లేదా బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి లావాదేవీలను ప్రయత్నించవచ్చు. అది కూడా సాధ్యపడకపోతే, కొంత సమయం వేచి ఉండి తరువాత మళ్లీ ప్రయత్నించడం ఉత్తమం.
మీ యూపీఐ పిన్
UPI లావాదేవీ సమయంలో, మీరు మీ UPI పిన్‌ను సరిగ్గా నమోదు చేయడం కూడా చాలా ప్రధానం. అప్పుడప్పుడు పిన్ తప్పుగా నమోదు చేయడం ద్వారా చెల్లింపు విఫలమవుతుంది. మీరు మీ UPI పిన్‌ను మరచిపోయినట్లయితే, మీ బ్యాంకు ఖాతా వివరాలు లేదా ATM కార్డ్ ఉపయోగించి దాన్ని రీసెట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News